BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ వివాదాస్పదం అయింది. దీనిపై ఇండియన్ గవర్నమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వలసవాద మనస్తత్వాన్ని తెలియజేస్తుందని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇక బ్రిటన్ రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ లో ఈ అంశాన్ని తేలనెత్తాడు. 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని హస్తం ఉందని ఆరోపించాడు. దీన్ని యూకే ప్రధాని రిషి సునాక్ తో పాటు పలువురు ఇతర ఎంపీలు ఖండించారు.
Read Also: Varalaxmi Sarathkumar: నన్ను చంపేస్తారనుకున్నా.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్
ఇదిలా ఉంటే ఈ వీడియో లింకును షేర్ చేయకుండా ట్విట్టర్, యూట్యూబ్ లకు ఆదేశాలు జారీ చేసింది భారతప్రభుత్వం. ఇదిలా ఉంటే ఈ అంశంపై మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు ప్రధానికి మద్దతుగా లేఖను విడుదల చేశారు. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీలో ‘అంతర్జాతీయ కుట్ర’దాగి ఉందని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ విచారణ కోరింది. ఊహాజనిత సాక్ష్యాలతో కొన్ని అదృశ్య శక్తులు ప్రధానిని అపఖ్యాతి చేయాలని చూస్తోందని అసోసియేషన్ ఆరోపించింది.
యూట్యూబ్, ట్విట్టర్ హ్యాండిళ్లలో దీన్ని బ్యాన్ చేయడాన్ని సమర్థించింది. కేంద్ర హోం మంత్రికి ఈ మేరకు ఓ లేఖ రాసి విచారణ కోరింది. ఈ అంతర్జాతయ కుట్రపై క్షుణ్ణంగా విచారణ జరపాలని బార్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ ఆదిష్ సి అగర్వాలా లేఖలో పేర్కొన్నారు. దీనిని ప్రతికూల మీడియా రిపోర్టుగా మాత్రమే చూడకూడదని.. మోదీ స్థాయిని తగ్గించేందుకు చూస్తున్నారని ఆరోపించింది.