Imran Khan: పాకిస్తాన్ దివాళా అంచుకు చేరుకుంది. ఇక అధికార ప్రకటన తరువాయిగా ఉంది. అయితే పాకిస్తాన్ ఈ ప్రమాదం నుంచి కోలుకునేందుకు తెగ కష్టపడుతోంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ అప్పు కోసం ప్రపంచం అంతా తిరుగుతున్నారు. అయితే దీనిపై ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చైర్మ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. షహబాజ్ షరీఫ్ ప్రపంచం అంతా చిప్ప పట్టుకుని అప్పుకోసం తిరుగుతున్నాడని.. ఏ దేశం కూడా అప్పు ఇవ్వడం లేదని అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: BBC Documentary on Modi: ప్రధాని మోదీపై అంతర్జాతీయ కుట్ర.. విచారణ కోరిన ఆల్ ఇండియా బార్ అసోసియేషన్
షరీఫ్ భారత్ చర్చలు జరపాలని వేడుకుంటున్నాడని.. అయితే మొదట ఉగ్రవాదాన్ని అంతం చేయమని భారత్ అడుగుతోందని.. అది జరిగితే న్యూఢిల్లీ ఆలోచించవచ్చని యూఏఈ మీడియాతో ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ తో చర్చలు జరపాలని కోరుకున్నాడు. అభివృద్ధి గురించి వ్యాఖ్యానిస్తూ.. భారత్ ఎల్లప్పుడు పాకిస్తాన్ తో సాధారణ పొరుగు సంబంధాలను కోరకుంటోందని..అయితే అలాంటి సంబంధాలకు ఉగ్రవాదం, హింస లేని వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడి నుంచో దిగుమతి అయిన ప్రభుత్వం మనల్ని ఏ పరిస్థితికి తీసుకువచ్చిందో చూడండి.. లండన్ లో ఉంటూ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడంటూ విమర్శించారు.
తనపై హత్యాయత్నం వెనుక షెహబాజ్ షరీఫ్, అంతర్గత మంత్రి రాణా సనావుల్లా, ఐఎస్‌ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్ మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ హస్తం ఉందని తాను 100 శాతం నిశ్చయించుకుంటున్నానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నన్ను చంపేందుకు ముగ్గురు శిక్షణ పొందిన షూటర్లను పంపారని ఆరోపించాడు.