Tamil Nadu Waqf Board Claims Ownership Of Entire Hindu Village, Including Temple Land: తమిళనాడులో కొత్త వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందూ గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు పరిధిలో ఉందని తెలియడంతో సదరు గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తిరుచిరాపల్లి జిల్లా తిరుచెందురై గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు పరిధి కింద ఉందని తెలియడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వింతేంటంటే 1500 ఏళ్ల క్రితం నాటి పురాతన సుందరేశ్వర ఆలయానికి సంబంధించిన 369 భూమి కూడా ఉంది. ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి కాదు. అయితే ఈ భూమి కూడా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు పరిధి కింద ఉండటంతో గ్రామస్తులు ఇదేలా సాధ్యం అని చర్చించుకుంటున్నారు.
ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి తనకు ఉన్న 1.2 ఎకరాల స్థలాన్ని అమ్మేసి కూతురు పెళ్లి చేద్ధాం అని అనుకున్నాడు. అయితే దీనిని విక్రయించాలంటే చెన్నైలోని వక్ఫ్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) తెచ్చుకోవాలని రాజగోపాల్ కు అధికారులు సూచించారు. సబ్ రిజిస్టార్ ఆఫీస్ కూడా ఈ భూమిని తమిళనాడు వక్ఫ్ బోర్డు కలిగి ఉందని 20 పేజీల పత్రాలను అందించారని సమాచారం. దీంతో ప్రస్తుతం గ్రామస్తులంతా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు క్యూ కట్టారు. అయితే రాజగోపాల్ 1992లో భూమిని కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని గ్రామస్తులు తెలుపుతున్నారు.
Read Also: Assam: అస్సాం ప్రభుత్వం, తీవ్రవాద సంస్థల మధ్య కీలక ఒప్పందం
ఈ ప్రాంతంలో ముస్లింలు నివసించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే వక్ఫ్ బోర్డు తిరుచ్చిలోని 12 రిజిస్ట్రేషన్ లేఖ రాసింది. ఆ ఆస్తులు మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందినవే అని క్లెయిమ్ చేసింది. చివరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ గ్రామస్తులు ఆక్రమణదారులుగా పేర్కొన్నారు. తిరుచెందురై గ్రామంలోని భూములన్నీ వక్ఫ్ బోర్డుకు చెందినవి అని.. ఎవరైనా విక్రయించాలంటే చెన్నైలోని బోర్డు నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
369 ఎకరాల ఆస్తిని కలిగి ఉన్న 1500 ఏళ్ల నాటి పురాతన సుందరేశ్వర దేవాలయం ముస్లింలకు చెందినది కాదని.. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని.. గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు దనపాల్ తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా వక్ప్ బోర్డుకు వేలాది ఎకరాల ఆస్తులు ఉన్నాయి. 18 ముస్లిం మెజారిటీ గ్రామాలను కలిగి ఉంది.