Asaduddin Owaisi comments on PM narendra modi: ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కు పెట్టారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. తీవ్రమైన సమస్యల నుంచి తప్పించుకునే విషయంలో ప్రధాని మోదీ చిరుతల కన్నా వేగంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజస్థాన్ జైపూర్ పర్యటకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. జ్ఞాన్వాపి మసీదు-శృంగర్ గౌరీ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రార్థనా స్థలాల చట్టానికి వ్యతిరేకంగా ఆయన అన్నారు.
Cheetahs Coming To India.. PM Narendra Modi will release: భారతదేశంలో అంతరించిపోయిన చిరుతలను నమీబియా నుంచి తెప్పిస్తోంది భారత ప్రభుత్వం. వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ వారం నమీబియా నుంచి ఎనిమిది చిరుతలు భారతదేశానికి రానున్నాయి. 10 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నమీబియా నుంచి ఇండియాకు ఈ శుక్రవారం జైపూర్ కు చేరనున్నాయి. ఎనిమిది చిరుతల్లో ఐదు ఆడవి కాగా..మూడు మగ చిరుతలు ఉన్నాయి.
IBM warns those working two jobs: వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఉపయోగించుకుని కొంత మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా మూన్ లైటింగ్ పద్ధతిలో ఒకటికి మించి ఉద్యోగాలు చేయడంపై సాఫ్ట్వేర్ కంపెనీలు చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఎవరైనా తమ సంస్థకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇలా చేస్తే ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాయి. మూన్ లైట్ పద్ధతి అనైతిక పద్ధతి అని అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ కంపెనీలు పేర్కొంటున్నాయి.
India's strong response to Islamic countries' comments On jammu kashmir: భారత్ ఎన్నిసార్లు చెప్పినా.. ఇస్లామిక్ దేశాల సమూహం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) తన వక్రబుద్ధిని మానుకోవడం లేదు. పదేపదే భారత అంతర్గత విషయం అయిన జమ్మూ కాశ్మీర్ అంశంపై వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఓఐసీ చేసిన వ్యాక్యలకు భారత్ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇస్లామిక్ దేశాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. అనవసరమైన సూచనలని కొట్టి పారిసేంది ఇండియా. పాకిస్తాన్ ద్వేషపూరిత ప్రచారానికి…
PM Modi Meets Bhutan King Jigme Khesar Namgyel Wangchuck: భారత్, భూటాన్ దేశాల మధ్య మరింతగా బంధం బలపడనుంది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. బుధవారం భూటాన్ రాజు వాంగ్ చుక్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అంతకుముందు వాంగ్ చుక్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో భేటీ అయ్యారు. బుధవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో కూడా భేటీ కానున్నారు వాంగ్ చుక్. మంగళవారం రోజు భూటాన్ అంతర్జాతీయ సోలార్…
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘ భారత్ జోడో యాత్ర’ విమర్శలు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. యాత్రలో పిల్లలను రాజకీయ సాధనాలుగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై చర్యలు తీసుకోవాలని.. విచారణ ప్రారంభించాలని అత్యున్నత బాలల హక్కుల సంఘం (ఎన్సీపీసీఆర్) ఎన్నికల సంఘాన్ని కోరింది.
Air India Express Plane Catches Fire At Muscat: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటితో ప్రమాదం తప్పింది. ఒమన్ రాజధాని మస్కన్ నుంచి కొచ్చికి బయలుదేరాల్సిన విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. టేకాఫ్ కు ముందు ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తం అయిన ఎయిర్ పోర్టు సిబ్బంది మంటలను ఆర్పివేసి.. ప్రయాణికులను రక్షించారు.
Most millionaires in these cities: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సంపన్నులు ఎక్కువగా నగరాల్లోనే నివసిస్తున్నారు. ఎక్కువ మంది మిలియనీర్లు ఉంటున్న టాప్ -10 నగరాల్లో సగం అమెరికాలోనే ఉన్నాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్ పార్ట్నర్స్ గ్రూప్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం న్యూయార్క్, టోక్యో, శాన్ ప్రాన్సిస్కో బే ఏరియాల్లో అత్యధిక మంది మిలియనీర్లు నివసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
Mehbooba Mufti comments on Gyanvapi case: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఇది స్పష్టంగా ప్రార్థన స్థలాల చట్టాలను ఉల్లఘించడమే అని అన్నారు. ఉద్యోగాలు కల్పించడంలో, ద్రవ్యోల్భాన్ని నియంత్రించడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మనం మసీదులు పడగొట్టడంలో ‘‘విశ్వగురువు’’ అవుతామని బీజేపీని ఎద్దేవా చేశారు.
Gaganyaan Expected to Launch in 2024: భారతదేశపు మొదటి మానవ అంతరిక్ష యాత్ర ‘‘ గగన్ యాన్’’ పేరుతో చేపట్టనుంది. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే.. 2024లో భారత మొదటి అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా ఈ గగన్ యాన్ మిషన్ కు సంబంధించిన షెడ్యూల్ ఆలస్యం అయింది.