Girl fell into borewell in Rajasthan: మరో బోరుబావి ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బండికుమ్ పట్టణంలో అడుకుంటూ వెళ్తున్న ఓ రెండేళ్ల చిన్నారి అంకిత 200 అడుగుల బోరుబావిలో పడిపోయింది. చిన్నారి కనపడకపోవడంతో బోరు బావిలో పడిందని కుటుంబీకులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం 100 అడుగుల దూరంలో చిన్నారి ఇరుక్కుపోయింది.
Read Also: Fire Department : హైదరాబాద్‌లో అగ్నిమాపక బృందాల తనిఖీలు..
దౌసా జిల్లాలోని బండికుయ్ పట్టణంలో బోర్‌వెల్ విషాదంలో రెండేళ్ల బాలిక 200 అడుగుల బోర్‌వెల్‌లో పడిపోయింది. అంకిత అనే అమ్మాయి 100 అడుగుల ఎత్తులో ఇరుక్కుపోయి కనిపించింది. దీంతో అధికారులు ఘటనా స్థాలానికి యంత్రాలు, ట్రాక్టర్లను పంపించి సహాయక చర్యలు ప్రారంభించారు. రాజధాని జైపూర్ నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సంఘట స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. మొత్తం జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. బాలికకు పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు వైద్యాధికారులు. ప్రస్తుతం బోరుకు సమాంతరంగా జేసీబీ సహాయంతో తవ్వుతున్నారు. సీసీ కెమెరాల ద్వారా బాలిక కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బాలికను సురక్షితంగా రెస్క్యూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.