CBI Takes Over Probe Into BJP Leader Sonali Phogat’s Death: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్ మృతిపై ఎట్టకేలకు సీబీఐ విచారణ ప్రారంభించింది. గత నెలలో గోవాలోని ఓ హోటల్ లో సోనాలి ఫోగట్ అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆ తరువాత రెస్టారెంట్ సీసీ కెమెరాలను చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును మొదటగా గోవా పోలీసులు విచారించారు. కేసును పక్కాగా విచారణ జరపాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కూడా గోవా ప్రభుత్వాన్ని కోరారు. హర్యానాలో నిర్వహించిన కాప్ పంచాయతీలో కూడా సోనాలి ఫోగాట్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ..గోవా సీఎం ప్రమోద్ సావంత్ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో కేంద్రం సీబీఐ విచారణకు అంగీకరించింది. సీబీఐ టీంలు గోవాకు చేరుకని కీలక విషయాలు అక్కడి అధికారులు, ఆమెను పరీక్షించిన వైద్యుల నుంచి తెలుసుకోనున్నారు.
Read Also: Pakistan: మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్‌ను అడుక్కునే దేశంగా చూస్తున్నాయి: పీఎం షహబాజ్ షరీఫ్
హర్యానాకు చెందిన సోనాటీ ఫోగట్ స్టార్ గా అందరికీ సుపరిచితమే.. తర్వాత హర్యానా ఎన్నికల ముందు ఆమె బీజేపీ పార్టీలో చేరింది. ఇదిలా ఉంటే ఆగస్టు 22-23 రాత్రి అనుమానాస్పద రీతిలో ఆస్పత్రిలో చేరిన ఆమె మరణించారు. టిక్ టాక్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన 43 ఏళ్ల ఫోగాట్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆమె సోదరుడు మాత్రం ఫోగాట్ మరణంలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె వ్యక్తిగత సహాయకులు సుధీర్ సాంగ్వాన్, సుఖ్విందర్ సింగ్ లపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ కేసులో గోవాలోని అంజునా బీచ్ లోని కర్లీస్ రెస్టారెంట్ సీసీ కెమెరాలను పరిశీలిస్తే విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు బలవంతంగా ఓ డ్రింక్ ను తాగించినట్లు సీసీ కెమెరాల్లో ఉంది. ఆ తరువాత ఆమెను వాచ్ రూంలోకి తీసుకెళ్లి గంటపాటు నిర్భందించారు. ఆ తరువాత ఆమెను ఆస్పత్రికి తరలించారు.. అక్కడ ఆమె మరణించారు. ఫోగాట్ కు మెథాంఫెటమైన్ కలిపిన డ్రింకును తాగించనట్లు పరీక్షల్లో తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. సోనాలి ఫోగాట్ సహాయకులతో పాటు ఇద్దరు డ్రగ్ సరఫరాదారులను, రెస్టారెంట్ యజమానికి కూడా అరెస్ట్ చేశారు. పోస్టుమార్టంలో సోనాలిఫోగాట్ శరీరంపై మొద్దుబారిన గాయాలు ఉండటంతో అనుమానాస్పద మరణం కాస్త హత్య కేసుగా మారింది. ఈ కేసు వెనక ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.