Chinese National Arrested For Physicaly assault on a minor Girl For Months: పాకిస్తాన్ దేశంలో ఓ చైనా దేశీయుడిని అరెస్ట్ చేశారు. గతంలో ఎన్ని నేరాలకు పాల్పడిన చైనా జాతీయుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. చివరకు అధికారులపై దాడులు చేసినా కూడా అక్కడి ప్రభుత్వం చైనా వ్యక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. అయితే తాజాగా ఓ చైనా జాతీయుడిని మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా టీనేజర్ పై చైనా వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. సదరు బాలిక చైనా వ్యక్తి వద్ద అనుమాదకురాలిగా పనిచేస్తోంది. 16 ఏళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతన్ని ఇస్లామాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Krishnam Raju: కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్..
సదరు చైనా వ్యక్తి వద్ద ఉద్యోగం చేయడం ప్రారంభించినప్పటి నుంచి తనను వేధించడం ప్రారంభించాడని.. బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి తనపై లైంగికంగా వేధింపుకు పాల్పడుతున్నాడని.. ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి బాలికపై నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చినప్పటికీ ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పలేదు. ఆమె పరిస్థితిన గమనించిన అక్క.. ఆస్పత్రికి తీసుకెళ్లగా 31 వారాల గర్భవతి అని తేలింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి చైనా జాతీయుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు, బాలికతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నట్లు వెల్లడించారు.
పాకిస్తాన్ దేశానికి అత్యంత మిత్రదేశంగా కొనసాగుతున్న చైనా.. ఆ దేశంలో పలు ప్రాజెక్టులను చేపట్టింది. సీపెక్ ప్రాజెక్టులో భాగంగా పాకిస్తాన్ దేశంలో రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి ఇస్తోంది. బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు నుంచి చైనా లోని జిన్జియాంగ్ ప్రావిన్సు వరకు రోడ్డు నిర్మిస్తోంది. అయితే ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా చాలా మంది చైనీయులు పాకిస్తాన్ లో తిష్టవేశారు. అక్కడి అమ్మాయి పరిస్థితిని ఆసరా చేసుకుని వారిని పెళ్లిపేరుతో మోసగిస్తున్నారు. చాలా సార్లు చైనా జాతీయులు స్థానిక ప్రజలు, అధికారులపై దాడులు చేసినా అక్కడి ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు.