Hijab Protest In Iran: ఇరాన్‌లో ఉద్ధృతంగా హిజాబ్ నిరసనలు.. సోషల్ మీడియాపై బ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab Protest In Iran:ఇరాన్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహ్స అమిని అనే మహిళ హిజాబ్ వేసుకోనందుకు మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత గత శుక్రవారం ఆమె మరణించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మహిళలు, యువత హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హిజాబ్ తీసువేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తన ఆందోళనలు చేస్తున్నారు.
తాజాగా రాజధాని టెహ్రాన్ తో పాటు ఇతర నగరాల్లో కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చిన ఆందోళనల్లో పాల్గొంటున్నారు. గురువారం పలు పోలీస్ స్టేషన్లకు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. 2019 తరువాత ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ తో పెద్ద ఎత్తున ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఆందోళనలు రాజధానితో పాటు 50 నగరాలకు వ్యాపించాయి.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Read Also: Gyanvapi case: శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని కోరిన హిందూ పక్షం
మరోవైపు ప్రభుత్వం ఈ నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘‘మేము చనిపోతే చనిపోతాం కానీ.. ఇరాన్ ను తిరిగి పొందుతాం’’ అని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఆరురోజులుగా నిరసనలు పెరుగుతుండటంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ పై తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు బ్లాక్ చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, యూట్యూబ్, టిక్ టాక్ తో సహ ఇటీవల కాలంలో మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన తర్వాత ఇరాన్ ప్రజలు వాట్సాప్, ఇన్ స్టాను ఎక్కువగా వాడుతున్నారు. అయితే నిరసనలు మరింత పెరగకుండా ప్రభుత్వం సోషల్ మీడియాను బ్లాక్ చేసింది.
గతవారం మహ్స అమిని అనే 22 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యులతో రాజధాని టెహ్రాన్ లో పర్యటిస్తున్న సమయంలో హిజాబ్ ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మంగళవారం అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ.. శుక్రవారం మరణించింది. ఆమె మరణంతో ఇరాన్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు, నిరసనలు పెరిగాయి.
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..