Cigarette prices: పార్లమెంట్ సెంట్రల్ ఎక్సైజ్(సవరణ) బిల్లు -2025ను ఆమోదించింది. దీని తర్వాత భారత్‌లో సిగరేట్ల ధర భారీగా పెరుగుతాయానే చర్చ నడుస్తోంది. ఆర్థిక సహాయ మంత్రి పంజక్ చౌదరి ప్రవేశపెట్టిన ఈ బిల్లులో, సిగరేట్లు, సిగార్లు, హుక్కు, ఖైనీ వంటి అనేక పొగాకు ఉత్పత్తులపై ఎక్సైస్ సుంకాలను సవరిస్తుంది.
Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ఏ విధంగా పాకిస్తాన్‌ను దెబ్బతీసిందనే వివరాలను ఇప్పుడిప్పుడే అక్కడి నేతలు ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత దాడులు తమ నూర్ఖాన్ ఎయిర్ బేస్‌కు నష్టాన్ని కలిగించాయని ఒప్పుకున్నారు.
Crime News: లివ్-ఇన్ రిలేషన్లలో అమ్మాయిలు మోసపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా బెంగళూర్‌లో ఓ వ్యక్తి అక్కాచెల్లెళ్లను లైంగిక దోపిడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 29 ఏళ్ల శుభం శుక్లా అనే వ్యక్తి ఇద్దరు అక్కాచెల్లెళ్లను మోసం చేసిన కేసులో బెంగళూర్ బాగల్‌గుంటే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రేమ ముసుగులో ఒక మహిళ నుంచి దాదాపుగా రూ. 20 లక్షలు, 200 గ్రాముల బంగారాన్ని కాజేశాడు. అయితే, శుభం శుక్లాకు అప్పటికే […]
Jammu Kashmir: చలికాలాన్ని ఆసరాగా చేసుకుని జమ్మూ కాశ్మీర్లో విధ్వంసాన్ని సృష్టించేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నారని చెబుతున్నాయి. 40 రోజుల అత్యంత కఠినమైన శీతాకాల దశ అయిన ‘‘చిల్లై కలాన్’’ సందర్భంగా భారత సైన్యం తీవ్రవాద నిరోధక ఆపరేషన్లను వేగవంతం చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని ఉపయోగించుకోకుండా ఉగ్రవాదుల్ని నిరోధించడానికి భద్రతను కట్టుదిట్టం చేసింది. Read Also: రూ.9000కే 6000mAh […]
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్‌లో జలాంతర్గామిలో ప్రయాణించారు. కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ అయిన INS వాఘషీర్‌లో రాష్ట్రపతితో పాటు నావికాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి కూడా ప్రయాణించారు. జలాంతర్గామిలో సముద్రంలోకి వెళ్లిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. అంతకుముందు, ఫిబ్రవరి 2006లో జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం నిలిచారు.
Bangladesh: బంగ్లాదేశ్‌కు చెందిన రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు, భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య ఆ దేశంలో హింసకు కారణమైంది. భారత్‌పై ఆరోపణలు నెడుతూ, అక్కడి మతోన్మాద మూక ఇండియన్ ఎంబసీపై కూడా దాడులకు పాల్పడింది. దైవదూషన ఆరోపణలపై అక్కడి మైనారిటీ హిందువులను హత్య చేసింది. ఇదిలా ఉంటే, హాది హత్యకేసులో ఇద్దరు ప్రధాన అనుమానితులు హత్య తర్వాత మేఘాలయ సరిహద్దు ద్వారా భారత్ పారిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
Asif Ali Zardari: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏ విధంగా భయపడిందో, ఎలా దెబ్బతిందనే సమాచారం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. సాక్ష్యాత్తు ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దాడుల సమయంలో పాకిస్తాన్ అగ్ర నాయకత్వంలో భయానక వాతావరణం ఉందని జర్దారీ అంగీకరించారు. భారత దాడుల సమయంలో భద్రత కోసం బంకర్లోకి వెళ్లాలని తన సైనిక కార్యదర్శి తనకు సలహా ఇచ్చారని అన్నారు.
High Court: కొడుకు తప్పు చేసిన రక్షించే తల్లులను శిక్షించే చట్టాలు లేవని పంజాబ్-హర్యానా కోర్టు వ్యాఖ్యానించింది. ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన కొడుకును రక్షించేందుకు ఆధారాలు నాశనం చేయాలని చూసిన తల్లిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడైన కొడుకుకు మరణశిక్షను రద్దు చేసి, జీవితఖైదు (30 సంవత్సరాలు రిమిషన్ లేకుండా), రూ. 30 లక్షల జరిమానాను విధించింది. అదే సమయంలో అతడి తల్లిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది.
Woman Kills Daughter: భాష అంటే అభిమానం ఉండాలి, కానీ అది ఉన్మాదంగా మారకూడదు. ఇటీవల కాలంలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడకుంటే దాడులు జరిగిన సంఘటనలు జరిగాయి. అయితే, తాజాగా జరిగిన ఘటన మాత్రం భాషోన్మాదానికి పరాకాష్ట. ఒక మహిళ తన ఆరేళ్ల కూతురు సరిగ్గా మరాఠీ మాట్లాడలేదనే కారణంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గొంతునులిమి హత్యకు పాల్పడింది. సుదీర్ఘ విచారణ తర్వాత, ఆ మహిళ పోలీసులకు ఈ విషయాన్ని చెప్పింది.
Eggs Prices: గతంలో రూ. 6, రూ. 7 లకు దొరికే ‘కోడిగుడ్డు’ ధర ఇప్పుడు రూ. 8కి చేరింది. అయితే, ఇలా ఎందుకు పెరుగుతున్నాయని సాధారణ వినియోగదారుడి మదిలో ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో, నగరాల్లో ఎగ్స్ రేట్లు పెరిగాయి.