Putin In India: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో అడుగుపెట్టారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రెండు రోజుల పాటు ఇండియా పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ఆయనను స్వయంగా ఎయిర్పోర్ట్లో స్వాగతించారు. పుతిన్ 23వ ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాలలో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. పుతిన్ పూర్తి షెడ్యూల్: మొదటి రోజు: * సాయంత్రం 6.35: వ్లాదిమిర్ పుతిన్ పాలం […]
Putin’s Security: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే, పుతిన్ సెక్యూరిటీ భారత్లో ఉంది. మరోవైపు, పుతిన్ కోసం భారత్ 5 అంచెల విస్తృత భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. పుతిన్ వ్యక్తిగత భద్రతా విభాగం, ఆయనను కంటికి రెప్పలా అడుగడుగు కాపాడుతోంది. రష్యాలో అత్యంత రహస్య భద్రతా సంస్థల్లో ఒకటైన ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (FSO) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. […]
Modi-putin: రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికాసేపట్లో భారత్లో ల్యాండ్ కాబోతున్నారు. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్ పర్యటించనున్నారు. ఇప్పటికే, భారత ప్రభుత్వం పర్యటన కోసం అత్యున్నత ఏర్పాట్లను చేసింది. పుతిన్ రాకతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పుతిన్ బస చేసే హోటల్, సందర్శించే ప్రాంతాలను భారత భద్రతా అధికారులతో పాటు రష్యన్ సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Pakistan: ఏ దేశానికైనా సైన్యం, దేశ భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తుంటుంది. కానీ, పాకిస్తాన్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. సైన్యం ఏం చేయకూడదో, అన్ని పనులను పాకిస్తాన్ మిలిటరీ చేస్తుంటుంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా చాలా రంగాలు పాక్ సైన్యం చేతిలో ఉన్నాయి. నిజం చెప్పలంటే పాక్ అంటే సైన్యం, సైన్యం అంటే పాక్. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆ దేశ జాతీయ ఎయిర్ లైన్స్ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.
Modi – Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు (డిసెంబర్ 4) భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. దేశమే కాకుండా, ప్రపంచం మొత్తం కూడా ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్ భేటీపై ఆసక్తి కనబరుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ తొలిసారిగా భారత్ రాబోతున్నారు. భారత్, రష్యాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు, సంతకాలు జరిగే అవకాశ ఉంది. ముఖ్యంగా చమురు, రక్షణ, వాణిజ్యంపై రెండు దేశాలు చర్చించనున్నాయి. వీటితో పాటు బ్రహ్మోస్, ఎస్-400, […]
Jaish-e-Mohammad (JeM): పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ తన వర్కింగ్ స్టైల్ను మార్చుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా జైష్ మహిళా ఉగ్రవాదుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. జైష్ చీప్ మసూద్ అజార్ సోదరి సయీదా నేతృత్వంలో జమాత్-ఉల్-మొమినాత్ అనే మహిళా ఉగ్రవాదం సంస్థను ఏర్పాటైంది
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు(డిసెంబర్ 4)న తన రెండు రోజుల పర్యటన కోసం భారత్ వస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధ్యక్షుడు భారత్ రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పర్యటనకు దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పుడు పుతిన్ బస చేయబోతున్న ఐటీసీ మౌర్య హోటల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్ ఈ విలాసవంతమైన హోటల్లోనే బస చేయబోతున్నారు. ఇప్పటికే, రష్యన్ […]
Rahul Gandhi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు సాయంత్రం భారత్లో తన రెండు రోజుల పర్యటన కోసం అడుగుపెట్టనున్నారు. పుతిన్ పర్యటనకు ముందు లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Techie Suicide: నగర పాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూర్లో జరిగింది. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించాడు. కొత్త ఇంటి నిర్మాణానికి పదే పదే ఆటంకాలు కలిగించడం, డబ్బులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం ఆరోపిస్తోంది.
Wedding: పెళ్లిలో వరుడు, వధువు బంధువులు ఘర్షణకు దిగిన ఘటన బీహార్ లోని బోధ్ గయాలో జరిగింది. కేవలం ‘‘రసగుల్లా’’ తక్కువైందని ఇరు వర్గాలు రచ్చరచ్చ చేశారు. ఇరువైపుల నుంచి కుటుంబ సభ్యులు, అతిథులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో పాటు, కుర్చీలతో దాడులు చేసుకున్నారు.