Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు భారత్ అపూర్వ స్వాగతం పలికింది. ప్రధాని నరేంద్రమోడీ నేరుగా వెళ్లి ఎయిర్‌పోర్టులో పుతిన్‌ను రిసీవ్ చేసుకున్నారు. రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి.
Putin dinner: విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, ప్రతిపక్ష నేతలను కలవకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని, గతంలో ఇలాంటి సంప్రదాయం ఉండేది కాదని పుతిన్ పర్యటనకు ముందు రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు వచ్చిన ఒక రోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది.
Pakistan: పాకిస్తాన్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీ చీప్ అసిమ్ మునీర్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్)గా నియమించింది. ఇటీవల పాకిస్తాన్ రాజ్యాంగంలో 27వ రాజ్యాంగ సవరణ చేసి, అసిమ్ మునీర్‌కు సీడీఎఫ్ రూపంలో అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రభుత్వానికి సమాంతర వ్యక్తిగా, ఒక విధంగా చెప్పాలంటే పౌర ప్రభుత్వం కన్నా మిన్నగా ఆయన అధికారాలు ఉంటున్నాయి. ఈ సీడీఎఫ్ పదవిలో మునీర్ 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. Read […]
Toyota Fortuner: నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. డిసెంబర్ 4న సాయంత్రం ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవ్వడంతోనే భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా రిసీవ్ చేసుకునేందుకు వెళ్లారు. పుతిన్‌కు భారత్ తరుపున అపూర్వ స్వాగతం పలికారు. పాలం ఎయిర్‌పోర్టు నుంచి ఇరువురు నేతలు కలిసి ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. అయితే, మోడీ-పుతిన్ ఇద్దరూ తెల్లటి “టయోటా ఫార్చ్యూనర్” కారులో ప్రయాణించడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. టయోటా ఫార్చ్యూనర్ […]
Putin: గత ఐదు దశాబ్ధాలుగా భారత సైనిక ఆధునీకీకరణలో రష్యా కీలక పాత్ర పోషిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. వైమానిక రక్షణ, వాయుసేన, నౌకాదళ రంగాల్లో భారతదేశానికి అత్యాధుని సాంకేతికత అందిస్తున్నామని చెప్పారు. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన పుతిన్, ఈ రోజు(డిసెంబర్ 5) సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
PM Modi: గత 8 ఏళ్లుగా ప్రపంచం అనేక అస్థిరతను చూసిందని, మానవత్వం సవాళ్లను చూసిందని, కానీ భారత్ రస్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్, రష్యా సంయుక్త మీడియా సమావేశంలో మోడీ, పుతిన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ పర్యటకు వచ్చారు. భారత్, రష్యాల మధ్య మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలపై చర్చలు జరుగుతాయి. ఇదిలా ఉంటే, ఇండియా టుడే పుతిన్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వైఖరి, వెస్ట్రన్ దేశాల నైజాన్ని ఎండగట్టారు.
PM Modi: రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా, స్వయంగా ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టుకు వెళ్లి పుతిన్‌ను ఘనంగా స్వాగతించారు. ప్రధాని మోడీ కొంత మంది విదేశీ అతిథుల కోసం మాత్రమే ఇలా ప్రోటోకాల్‌ను బ్రేక్ చేసి, స్వయంగా రిసీవ్ చేసుకున్నారు.
Putin Flight: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు(డిసెంబర్ 4)న భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్ పట్టించుకోకుండా, నేరుగా పాలం ఎయిర్ బేస్‌కు వెళ్లి పుతిన్‌ను ఘనంగా స్వాగతించారు. అక్కడ నుంచి ఇద్దరూ కూడా ప్రధాని నివాసానికి వెళ్లారు.
Putin In India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. కాసేపటి క్రితం ఆయన ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయ్యారు. పుతిన్‌ను స్వాగతించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ, ఎయిర్ పోర్టుకు వచ్చారు. పుతిన్‌ను మోడీ ఘనంగా స్వాగతించారు.