Khaleda Zia: భారత్, బంగ్లాదేశ్ మధ్య దెబ్బతిన్న సంబంధాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చైర్పర్సన్ బేగం ఖలీదా జియా అనారోగ్య సమస్యలతో ఈ రోజు(సోమవారం) మరణించారు. అయితే, ఖలీదా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. డిసెంబర్ 31న జరిగే ఖలితా అంత్యక్రియల కోసం జైశంకర్ ఢాకాకు వెళ్లనున్నారు. ఖలీదా జియా కుమారుడు, బీఎన్పీ యాక్టింగ్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న తారిక్ రెహమాన్ 17 ఏళ్ల […]
Assam: అస్సాం పోలీసులు బంగ్లాదేశ్‌తో సంబంధం ఉన్న అతిపెద్ద ఉగ్ర ముఠాను అరెస్ట్ చేశారు. భారత భద్రతా, నిఘా విభాగం ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అస్సాంలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ టెర్రర్ మాడ్యూల్‌ను అధికారులు భగ్నం చేశారు. మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నసీమ్ ఉద్దీన్ అలియాస్ నజీముద్దీన్, అలియాస్ తమీమ్(24), జునాబ్ అలీ (38), అఫ్రాహిమ్ హుస్సేన్ (24), మిజానూర్ రెహమాన్ (46), […]
Sadhguru: బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి నాయకులు ముఖ్యంగా జమాతే ఇస్లామీ పార్టీ నేతలు, పలువురు ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకులు పదే పదే భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా, తమతో పెట్టుకుంటే, భారత్‌ను ముక్కలు చేస్తామని, భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని, భారత్‌లోని ఇతర ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రాలను కలిసే ‘‘సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్)’’ను ఆక్రమించుకుంటామని ప్రగల్భాలు పలుకున్నారు.
Iran: ఇరాన్లో మూడేళ్ల తర్వాత మరోసారి భారీ స్థాయిలో ‘‘ఇస్లామిక్ పాలన’’కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 2022-23లో మహ్సా అమిని హిజాబ్ వేసుకోలేదని అక్కడి మెరాలిటీ పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయింది.
Banglasesh: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ యువకుడిని అక్కడి మతన్మాదులు హత్య చేశారు. దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యల తర్వాత ఇది మూడో ఘటన. ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్‌ను నోమన్ మియాన్ అనే వ్యక్తి కాల్చి చంపినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయని అమిత్ షా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పహల్గాం దాడిని కేంద్రమే చేసిందా? అని మమత ప్రశ్నించారు.
India-Pakistan war: భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) సాయుధ సంఘర్షణ అవకాశాలకు సంభావ్యత ఉందని చెప్పింది.
Bengaluru: కొత్తగా పెళ్లయిన జంట రెండు రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఇద్దరు 1000 కి.మీ దూరంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గురువారం బెంగళూర్‌లో భార్య గనవి(26) ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల తర్వాత 36 ఏళ్ల సూరజ్ శివన్న నాగ్‌పూర్‌లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గనవి సూసైడ్ తర్వాత, భర్తనే ఆత్మహత్యకు ప్రేరేపించడానే ఆరోపణలతో సూరజ్‌పై కేసు నమోదైంది.
BSF: రాడికల్ విద్యార్థి నేత, ఇంక్విలాబ్ మోంచో నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హంతకులు మేఘాలయ సరిహద్దు గుండా భారతదేశానికి పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ వాదనల్ని భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఆదివారం తోసిపుచ్చింది. బంగ్లా చెబుతున్నదాని ప్రకారం, సరిహద్దుల్లో ఎలాంటి కదలికలు లేవని అదికారులు చెప్పారు.
Suvendu Adhikari: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల హత్యలు, దాడులపై పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, భారత్ కూడా బంగ్లాదేశ్‌కు గుణపాఠం నేర్పాలి’’ అని అన్నారు. శుక్రవారం రోజు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ,