మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025-26 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అద్భుతమైన రీతిలో పుంజుకుని తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించి 50 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో కేవలం 145 పరుగులకే ఆలౌట్ అయింది.
PhonePe కొత్త ఫీచర్.. ఒక క్లిక్‌తో చెల్లింపు.!
196 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ముంబై బౌలర్ల ధాటికి WPL చరిత్రలో మొదటిసారిగా ఢిల్లీ జట్టు పవర్‌ప్లే ముగియక ముందే కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు షెఫాలీ వర్మ (8), లారా వోల్వార్డ్ (9) , కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన జెమీమా రోడ్రిగ్స్ (1) కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకుండానే నికోలా కేరీ, నటాలీ సీవర్ బ్రంట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. మరిజన్నే కాప్ కూడా తక్కువ పరుగులకే అవుట్ కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. ముంబై బౌలర్లలో నికోలా కేరీ , అమేలియా కెర్ చెరో మూడు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్ వెన్నుముక విరిచారు.
అయితే, ఢిల్లీ జట్టు భారీ పరాజయం పాలయ్యే ప్రమాదంలో ఉన్న వేళ షినెల్ హెన్రీ వీరోచిత పోరాట పటిమను కనబరిచింది. ఆమె కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీ సాధించడంతో ఓటమి భారం కొంత తగ్గింది. కానీ ఇతర బ్యాటర్ల నుండి సహకారం అందకపోవడం, ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఢిల్లీ పరాజయం ఖాయమైంది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ జెమీమా మాట్లాడుతూ.. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం తమ ఓటమికి కారణమని, తదుపరి మ్యాచ్‌ల్లో తప్పక పుంజుకుంటామని పేర్కొన్నారు. ఈ విజయం ముంబై ఇండియన్స్‌కు సీజన్‌లో కొత్త ఉత్తేజాన్ని ఇవ్వగా, ఢిల్లీకి మాత్రం తమ ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది.
CM Revanth Reddy : నేను డాక్టరును కాదు.. సోషల్ డాక్టరును.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.!