Anti-Hijab Protests: హిజాబ్‌కు వ్యతిరేకంగా “జుట్టు ముడవడమే” తప్పైంది.. కాల్చి చంపిన ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-Hijab Protests in Iran: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇరాన్ దేశాన్ని కుదిపేస్తోంది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మహ్స అమినిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె మరణించింది. ఇది జరిగినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడి సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ యువతి జట్టు ముడిచి హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొంటున్నానని తెలుపుతూ చేసిన ఓ పోస్టు అక్కడ వైరల్ గా మారింది. 23 ఏళ్ల ఇరాన్ యువతి హదీస్ నజాఫీ తను జట్టు ముడుస్తూ.. హిజాబ్ కు వ్యతిరేఖంగా పోరాటంలో పాల్గొంటున్నానని ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఆమెను ఇరాన్ భద్రతా బలగాలు కాల్చి చంపాయని తెలుస్తోంది. జర్నలిస్ట్, మహిళా హక్కుల న్యాయమాది మసీష్ అలినేజాద్ సెప్టెంబర్ 25న ఆమె మరణాన్ని ధృవీకరించారు. ఇరాన్ భద్రతా బలగాలు ఆరుసార్లు ఆమెను కాల్చి చంపినట్లు ఆమె ట్వీట్ చేశారు.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
https://twitter.com/1500tasvir_en/status/1574110465776574467
ఇదిలా ఉంటే మరో మహిళ తన సోదరుడి అంత్యక్రియల్లో జట్టు కత్తిరించుకున్న మరో ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. నిరసనల్లో ఇప్పటి వరకు 50కి పైగా మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్ భద్రతా బలగాల్లో ఐదో వ్యక్తి మరణించారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వాయువ్య ఇరాన్‌లోని ఉర్మియా నగరంలో జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన బసిజ్ మరణించినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అశాంతికి కారణం అవతున్న నిరసనకారులపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెచ్చరించారు.
మహ్సా అమిని చనిపోయి పది రోజులు గుడస్తున్నా.. ఇరాన్ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇదిలా ఉంటే గుండె జబ్బులతో మహ్సా అమిని చనిపోయిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఇదంతా అబద్దమని తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్యం లేదని ఆమె తండ్రి వెల్లడించారు. మోరాలిటీ పోలీసులే నా కుమార్తెను కొట్టి చంపారని.. కనీసం డెత్ రిపోర్టు కూడా చూడనివ్వలేదని అధికారులపై, ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
https://twitter.com/AlinejadMasih/status/1573963922306129920
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!