Mass protests in Russia: పాక్షిక సైనిక సమీకరణపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశంలో భారీగా నిరసనలు జరుగుతున్నాయి. బుధవారం రష్యాలో యువత పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. పుతిన్ ప్రకటనతో అక్కడి యువత గందరగోళానికి గురువుతోంది. ఉక్రెయిన్ నుంచి ఎదురువుతున్న ప్రతిఘటనను తిప్పికొట్టేందుకు దాదాపుగా 3 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. దీంతో పాటు గతంలో మిలిటరీలో పనిచేసిన వారిని, యువతను సమీకరించేందుకు పాక్షిక సైనిక సమీకరణపై ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు పిలుపునివ్వడంతో అక్కడి యువత వేరే దేశాలకు పయణమవుతోంది. ఇదిలా ఉంటే ఆ దేశంలో యువత ఎక్కడికి వెళ్లకుండా రష్యా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ముఖ్యంగా యువకులు దేశం వదిలిపోకుండా చర్యలు తీసుకుంటోంది. ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ పై నిఘా పెంచింది. ఇదిలా ఉంటే రష్యాకు సరిహద్దులో ఉన్న జార్జియా దేశానికి రష్యన్ యువత వెళ్తోంది. రష్యా- జార్జియా మధ్య ఉన్న సరిహద్దు వద్ద వందల కొద్దీ వాహనాలు నిలిచి ఉన్నాయి. ఇదిలా ఉంటే రష్యా నుంచి యువత మీ దేశానికి రాకుండా చర్యలు తీసుకోవాలని పుతిన్ జార్జియాను కోరినట్లు సమాచారం.
Read Also: PFI targeting RSS leaders: ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసిన పీఎఫ్ఐ.. నేతల కదలికపై నిఘా
దీంతో మాజీ సోవియట్ యూనియన్ దేశాలకు రష్యా యువత వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. కజకిస్తాన్ వెళ్లేందుకు రష్యా యువత భారీగా సరిహద్దుకు చేరుకుంటోంది. మాజీ సోవియట్ యూనియన్ దేశాల్లోకి రష్యా పాస్ పోర్టు ఉన్న వారికి ఈజీగా ప్రవేశించే అవకాశం ఉంది. అయితే రష్యాకు కోపం వస్తుందనే కారణాలతో ఇప్పుడు ఆ దేశాలు కూడా సరిహద్దులను పటిష్టం చేసినట్లు తెలుస్తోంది.
అయితే సరిహద్దుల మూసివేతపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. దేశంలో మార్షల్ లా విధించిన తర్వాత ఈ చర్య ఉంటుందని క్రెమ్లిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అణుబాంబులు వేసేందుకు కూడా వెనకడుగు వేయం అని పుతిన్ స్పష్టం చేశారు. దీన్ని అమెరికా, యూరప్ వంటి వెస్ట్రన్ దేశాలు బెదిరింపులుగా భావంచకూడదని వార్నింగ్ ఇచ్చారు పుతిన్.