Tata Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది.. ధర, ప్రత్యేకతలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Tiago EV: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది.. టాటా టియాగో ఈవీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయింది.. ఇప్పటి వరకు కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లోనే వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చాయి. అయితే తొలిసారిగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ కారును టాటా తీసుకువచ్చింది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. అయితే తాజాగా టియాగో ఈవీని మార్కెట్ లో విడుదల చేసింది.
కొత్త టియాగో ఈవీ ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఫీచర్లను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేలా కార్ ను తీర్చిదిద్దారు. అయితే రెండు బ్యాటరీ ఆప్షన్లతో టియాగో ఈవీ వస్తోంది. ఒకటి 315 కిలోమీటర్ల రేంజ్ ఇస్తే.. మరొక బ్యాటరీ ఆప్షన్ లో 250 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది. ఐపీ67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్ ( వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్)ను టియాగో ఈవీలో అమర్చారు.
Also Read
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!

24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 315 కిలోమీటర్ రేంజ్ ఇస్తే.. 19.2 కిలోవాట్ అవర్ 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. 3.3 కిలో వాట్ ఏసీ ఛార్జర్, 7.2 కిలో వాట్ ఏసీ హోమ్ ఫాస్ట్ ఛార్జర్ల ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా బ్యాటరీని (10% – 100% వరకు) 3.36 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. 7.2 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే 35 కిలోమీటర్ల రేంజ్ పొందవచ్చు. అలాగే.. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 30 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్ల రేంజ్ పొందవచ్చు. దీని ద్వారా కేవలం 57 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీని ఛార్జింగ్ చేయవచ్చు.

మొత్తం ఐదు రంగుల్లో కారు అందుబాటులో ఉంది. టీల్ బ్లూ, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్, మిడ్‌నైట్ ప్లం, ట్రాపికల్ మిస్ట్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. సిటీ, స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్స్ టియాగో కారులో ఉన్నాయి. ప్రతీ మోడ్ లో ఫోర్ లెవల్ రీజెనరేషన్ సెట్టింగ్స్ ఉన్నాయి.

ప్రస్తుతం ఇండియా మార్కెట్ లో అతి తక్కువ ధరకు లభించే ఈవీ కారుగా టియాగో నిలవబోతోంది. కేవలం 10 లక్షల లోపే ఈవీ కారును టాటా అందిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఈవీ కారు కూడా టాటాకు చెందిన నెక్సాన్ ఈవీనే. నెక్సాన్ ఈవీతో పాటు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, టాటా టిగోర్ కార్లు ప్రధానంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!