PM Modi: ప్రపంచ నాయకులు ‘డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రపంచ నాయకుల్లో ఎవరికీ లేని ఆదరణ మోడీకి ఉన్నట్లు తేలింది. అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన ‘‘మార్నింగ్ కన్సల్ట్’’ శుక్రవారం విడుదల చేసిన డేటాలో మోడీ అగ్రస్థానంలో ఉన్నట్లు చూపించింది. ప్రధాని మోడీకి ఏంకగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉందని తెలిపింది.
Israel: ఇజ్రాయిల్ సైన్యంలో అన్ని రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్‌లోని సైనికులు, అధికారులు ఇస్లాం గురించి అధ్యయనం చేయడం, అరబిక్ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. అక్టోబర్ 07, 2023 నాటి నిఘా వైఫల్యం తర్వాత, మరోసారి అలాంటి దాడి జరుగొద్దని భావిస్తున్న ఇజ్రాయిల్ ఈ నిర్ణయం తీసుకుంది.
Udaipur Files: 2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్‌లోనే శరీరం నుంచి తలను వేరు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథాంశం ఆధారంగా నిర్మించిన "ఉదయ్‌పూర్ ఫైల్స్ - కన్హయ్య లాల్ టైలర్ మర్డర్" సినిమాకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి.
Bombay High Court: పాలస్తీనా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరసనకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జస్టిస్ రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కన్నా ఎక్కువగా విదేశాల పర్యటిస్తున్నారు. తాజాగా, ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. అయితే, మునీర్ తన బీజింగ్ పర్యటనలో చైనా చేతిలో చీవాట్లు తిన్నట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆసిమ్ మునీర్‌ని నేరుగా మందలించిన పనిచేశారు. పాకిస్తాన్లో చైనా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయుల భద్రత గురించి వాంగ్ యీ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ వ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో…
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ భగీదారీ బాయి సమ్మేళన్‌లో మాట్లాడుతూ..ప్రధాని మోడీకి చేసేదంతా ‘‘షో’’నే అని, ఆయకు సరైన విషయం లేదని అన్నారు. ఆయన ఒక పెద్ద ప్రదర్శన, ఆయనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారని కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీని రెండు మూడు సార్లు కలిసిన తర్వాత, ఆయనతో ఒకే గదిలో కూర్చున్న తర్వాత, […]
Drone Missile: భారత్ సరికొత్త ఆయుధాలతో సత్తా చాటుతోంది. తాజాగా డ్రోన్ ద్వారా మిస్సైల్ ప్రయోగించే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక టెస్ట్ సెంటర్లో డ్రోన్ నుంచి ప్రిసెషన్-గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కర్నూలులో UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM)-V3 పరీక్షలను నిర్వహించింది.
Hydrogen Rail: భారత రైల్వే చరిత్ర సృష్టించింది. గ్రీన్ రైల్ ఆవిష్కరణలో భాగంగా, భారత్ తన మొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు కోచ్‌ను విజయవంతంగా పరీక్షించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధ్రువీకరించారు. ఆయన టెస్ట్ రన్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ శాఖ చీఫ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ‘‘ఇప్పటికీ కొనసాగుతోంది’’ అని శుక్రవారం చెప్పారు. దేశ సైనిక సంసిద్ధత హై అలర్ట్‌లో ఉందని, 24 గంటలూ, ఏడాది పొడవునా ఉంటుందని చెప్పారు.
Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వచ్చిన మహ్మద్ యూనస్ పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రెండు దేశాలు భారత్ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. తాజాగా, బంగ్లా-పాక్‌లు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దౌత్య, అధికారిక పాస్‌పోర్టులు కలిగిన వ్యక్తుల వీసా రహిత ప్రవేశానికి అంగీకరించాయి.