Thailand-Cambodia: థాయిలాండ్, కంబోడియాల మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదిరింది. ఇరు దేశాలు కూడా రాకెట్లు, యుద్ధ విమానాలో దాడులు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య ‘‘ప్రీహ్ విహార్’’అనే 1000 ఏళ్ల నాటి హిందూ ధర్మానికి చెందిన శివాలయం ఘర్షణలకు కేంద్రంగా ఉంది. దీని కోసం రెండు దేశాలు గత కొన్నేళ్లుగా ఘర్షణకు దిగుతున్నాయి.
Juice diet: కఠినమైన ‘‘డైట్’’ ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందో తెలుసుకోవడానికి ఈ ఘటనే నిదర్శనం. డాక్టర్లు, పోషకాహార నిపుణుల సలహాలు లేకుండా, మూడు నెలలుగా కేవలం ‘‘జ్యూస్’’లు తాగుతూ డైట్ పాటించిన 17 ఏళ్ల కుర్రాడు మరణించాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కొలాచెన్లో జరిగింది. మృతుడు శక్తిశ్వరన్, గత మూడు నెలలుగా తీవ్రమైన డైట్ ప్లాన్ లో ఉన్నట్లు కుటుంబీకులు చెప్పారు. అయితే, శక్తిశ్వరన్ ఆరోగ్యంగా, చురుగా ఉన్నాడని, అంతలోనే మరణించడంపై కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Air India Crash: గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అంతా మరణించారు. విమానం కూలడంతో నేలపై ఉన్న 19 మంది మరణించారు.
Fighter jets: భారత్ తన రక్షణ సామర్థ్యాలను పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్, చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా దేశీయ రక్షణ పరికరాలకు ప్రాధాన్యత ఇస్తూనే, విదేశీ టెక్నాలజీ వెపన్స్‌ను కూడా కొనుగోలు చేస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారతదేశం 5వ తరం యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం, ఈ ఫైటర్ జెట్లు కేవలం రష్యా, అమెరికా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. రష్యా తన ఫిఫ్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ Su-57ని […]
Air India Express: గురువారం మస్కట్ నుంచి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో థాయిలాండ్‌కు చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది, విమానంలో ఉన్న ఒక నర్సు ప్రసవానికి సహాయం చేసినట్లు ఎయిర్‌లైన్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
Illegal immigrants: అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని భారతదేశం గుర్తించి, వారిని సొంత దేశానికి పంపిస్తోంది. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు దేశంలోకి చొరబడుతున్నారు. వీరందరిపై భారత్ ఇప్పుడు పోరాడుతోంది. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వీరిని గుర్తించి సొంతదేశానికి తిప్పిపంపిస్తున్నారు. అయితే, ఇప్పుడు అంతర్జాతీయ హక్కుల సంస్థకు మాత్రం వీరిపై తెగ జాలి చూపిస్తోంది. భారత్ తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తోంది.
India-UK Free Trade Deal: భారత్, యూకే మధ్య ‘‘స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)’’ కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు యుకె ప్రధాని కీర్ సమక్షంలో వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మరియు బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
India-UK Trade Deal: భారత్, యూకే మధ్య ప్రతిష్టాత్మక ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)’’ కుదిరింది. గురువారం లండన్‌లో ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు.
The Girlfriend: తన గర్ల్ ఫ్రెండ్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడని, ఒక వ్యక్తి తన స్నేహితుడినే హత్య చేశాడు. గర్ల్ ఫ్రెండ్‌ని ఫాలో అవ్వడం అతడికి కోపం తెప్పించింది. దీంతో, స్నేహితుడిని చంపడానికి ప్లాన్ వేసి అమలు చేశారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో జరిగింది. 17 ఏళ్ల రెహాన్ తన స్నేహితురాలు, వసీం గర్ల్ ఫ్రెండ్ అయిన అమ్మాయిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యాడు. ఇది వసీం ఆగ్రహానికి కారణమైంది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. మరోసారి క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచబోతోంది. దాయాదులు మరోసారి కలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ ఉండే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ T20 టోర్నమెంట్‌కు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలుస్తోంది.