Hydrogen Rail: భారత రైల్వే చరిత్ర సృష్టించింది. గ్రీన్ రైల్ ఆవిష్కరణలో భాగంగా, భారత్ తన మొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు కోచ్‌ను విజయవంతంగా పరీక్షించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధ్రువీకరించారు. ఆయన టెస్ట్ రన్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read Also: Landmine Blast: జమ్మూ కాశ్మీర్‌లో పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాను మృతి
భారత్ ప్రస్తుతం 1,200 HP హైడ్రోజన్-శక్తితో నడిచే రైలును అభివృద్ధి చేస్తోందని, ఇది హైడ్రోజన్ రైల్వే సాంకేతికతలో ప్రపంచ అగ్రదేశాల సరసన మన దేశాన్ని నిలబెట్టే కీలక సంఘటన అని ఆయన పేర్కొన్నారు. “మొదటి హైడ్రోజన్-పవర్‌తో నడిచే కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్) చెన్నైలోని ICFలో విజయవంతంగా పరీక్షించబడింది. భారతదేశం 1,200 HP హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తోంది. ఇది భారతదేశాన్ని హైడ్రోజన్-శక్తితో నడిచే రైల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉంచుతుంది” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’’ చొరవ కింద 35 హైడ్రోజన్-పవర్డ్ రైళ్లను నడపాలని యోచిస్తున్నట్లు 2023లో అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలియజేశారు. ప్రతీ రైలుకు రూ. 80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
First Hydrogen powered coach (Driving Power Car) successfully tested at ICF, Chennai.
India is developing 1,200 HP Hydrogen train. This will place India among the leaders in Hydrogen powered train technology. pic.twitter.com/2tDClkGBx0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 25, 2025