Drone Missile: డ్రోన్ నుంచి మిస్సైల్ ప్రయోగం.. సత్తా చాటిన భారత్..
- మరోసారి సత్తా చాటిన భారత్..
- డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drone Missile: భారత్ సరికొత్త ఆయుధాలతో సత్తా చాటుతోంది. తాజాగా డ్రోన్ ద్వారా మిస్సైల్ ప్రయోగించే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక టెస్ట్ సెంటర్‌లో డ్రోన్ నుంచి ప్రిసెషన్-గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కర్నూలులో UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM)-V3 పరీక్షలను నిర్వహించింది.
Read Also: Air India Crash: బోయింగ్ ఇంధన వ్యవస్థలో లోపం లేదు.. యూఎస్ ఏవియేషన్ సంస్థ..
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ఈ ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓని అభినందించారు. ఈ పరీక్ష భారత దేశ క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచిందని అన్నారు. ULPGM-V2ని DRDO యొక్క టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL) అభివృద్ధి చేసింది. ప్రయోగం విజయంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు.
ఈ ULPGM-V3 మిసైల్ ప్రత్యేకతలు:
* హై డెఫినిషన్ డ్యూయల్ చానల్ సీకర్, ఇది రోజూ, రాత్రీ టార్గెట్‌ను గుర్తించి ఆపరేట్ చేయగలదు.
* రెండు దిశల డేటా లింక్ సదుపాయం ద్వారా టార్గెట్‌ను ప్రయోగం తర్వాత కూడా అప్‌డేట్ చేయవచ్చు.
మూడు రకాల వార్‌హెడ్ మాడ్యూల్స్:
1. యాంటీ ఆర్మర్ – ఆధునిక ట్యాంకులపై దాడికి
2. పెనెట్రేషన్ కమ్ బ్లాస్ట్ – బంకర్‌లు చీల్చేందుకు
3. ప్రీ-ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్ – విస్తృత ప్రభావంతో లక్ష్యాలను తుడిచివేయగల సామర్థ్యం
ఈ ప్రాజెక్టును డీఆర్‌డీవోకి చెందిన పలు ల్యాబ్‌లు కలసి అభివృద్ధి చేశాయి. ఇమారత్ రీసెర్చ్ సెంటర్, డీఆర్‌డీఎల్, టెర్మినల్ బెలిస్టిక్స్ ల్యాబ్, హై ఎనర్జీ మెటీరియల్స్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఈ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రయోగంలో యాంటీ ఆర్మర్ వార్‌హెడ్ మోడల్‌ను పరీక్షించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ మిసైల్‌ను ప్రయోగించిన UAV కూడా బెంగళూరుకు చెందిన భారతీయ స్టార్టప్ – న్యూస్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. దీని ద్వారా దేశీయ పరిశ్రమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ ప్రాజెక్టుకు అడాని డిఫెన్స్, భారత డైనమిక్స్ లిమిటెడ్ (హైదరాబాద్), 30 MSMEs, స్టార్టప్‌లు సహకరించాయి. డీఆర్‌డీవో ఛైర్మన్ డా. సమీర్ వి. కామత్ మాట్లాడుతూ, ఇలాంటి శక్తివంతమైన ఆయుధాల అభివృద్ధి ఈ సమయానికి అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
In a major boost to India’s defence capabilities, @DRDO_India has successfully carried out flight trials of UAV Launched Precision Guided Missile (ULPGM)-V3 in the National Open Area Range (NOAR), test range in Kurnool, Andhra Pradesh.
Congratulations to DRDO and the industry… pic.twitter.com/KR4gzafMoQ
— Rajnath Singh (@rajnathsingh) July 25, 2025
Andhra Pradesh is proud to contribute to the growth of our nation's defence ecosystem! Congratulations to our scientists and innovators on the successful flight trials of the UAV-Launched Precision Guided Missile (ULPGM-V3) at the National Open Area Range (NOAR) in Kurnool,… https://t.co/JPKZqGSHEW
— N Chandrababu Naidu (@ncbn) July 25, 2025
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!