Maldives President: ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల మాల్దీవుల పర్యటన ముగిసింది. ‘‘ఇండియా అవుట్’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, ఇప్పడు భారతదేశాన్ని, భారత ప్రజల్ని, భారత ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు.
Truck: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలి సమీపంలో అదుపు తప్పిన ట్రక్కు 20 వాహనాలను ఢీకొట్టింది. కంటైనర్ ట్రక్కు ఘాట్ సెక్షన్లో వాలు నుంచి దిగుతుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ సంఘటన జరిగింది. నియంత్రణ కోల్పోయిన ట్రక్కు ముందున్న పదుల సంఖ్యలో వాహనాలనపు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొనడంతో పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే చాలా మంది గాయపడ్డారు. Read Also: Srushti IVF […]
Maldives: భారత ప్రధాని నరేంద్రమోడీ మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. మాల్దీవులకు అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ ముయిజ్జూ ఆహ్వానం మేరకు ఆ స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరయ్యారు. ముందుగా చైనాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, భారత్ విలువ ఏంటో తెలియడంతో ముయిజ్జూ కాళ్ల బేరానికి రావాల్సి వచ్చింది. ఏ నోటితో ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో అధికారంలోకి వచ్చాడో, ఇప్పుడు అదే నోటితో భారత్‌ని పొగుడుతున్నాడు.
The Husband: ప్రస్తుతం కాలంలో పెళ్లి చేసుకోవాలంటేనే మగాళ్లు భయపడుతున్నారు. పెళ్లి చేసుకుంటే, భార్య లవర్ చేతిలో హత్యకు గురవుతామో అనే భయం కూడా కొందర్ని వెంటాడుతోంది. మరికొందరు మాత్రం, చాలీచాలని జీతంతో పెళ్లి చేసుకోవడం అవసరమా..? అని భావిస్తున్నారు. భార్యలు, అత్తమామల ఖరీదైన కోరికలు తీర్చడానికి జంకుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా భార్య లగ్జరీ కోరికలు తీర్చేందుకు ఓ వ్యక్తి పూర్తి స్థాయిలో దొంగగా మారాడు.
Donald Trump: యూరప్ దేశాల్లోకి ఇబ్బడిముబ్బడిగా కొనసాగుతున్న వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వలసలు యూరప్‌ని చంపేస్తున్నాయి’’ అంటూ శనివారం ఆయన వ్యాఖ్యానించారు. వలసల్ని నిరోధించడానికి కలిసి రావాలని అన్నారు. స్కాట్లాండ్లో పర్యటనలో ఉన్న ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. చాలా యూరోపియన్ దేశాలు ‘‘భయంకరమైన దండయాత్ర’’లను ఎదుర్కొంటున్నాయని, వీటిని ఆపాల్సిన అవసరం ఉందని అన్నారు.
World Leaders: భారతదేశం ప్రాచీన కాలంలో అనేక విద్యలకు నిలయంగా ఉండేది. మన రాజులు తక్షశిల, నలంద, వల్లభి, విక్రమశిల వంటి అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. దురాక్రమణదారుల దాడుల్లో చాలా వరకు ఇవి నాశనం అయ్యాయి. ఆ సమయంలో ప్రపంచంలోని పలుదేశాల నుంచి వచ్చి ఇక్కడి విద్యను అభ్యసించేవారు. ఇదంతా పక్కన పెడితే, ఆధునిక యుగంలో కూడా పలువురు భారతదేశంలో విద్యను అభ్యసింది, ఆ తర్వాత తమ సొంత దేశాలకు అధినేతలుగా ఎదిగారు.
Chirag Paswan: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఎన్డీయేలోని మిత్రపక్షాలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల, బీహార్ వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించిన సంఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా, అంబులెన్స్‌లో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన బీహార్ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Cobra snake: బీహార్ రాష్ట్రంలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా, నాగుపాము అంటేనే ఒక్కొక్కరు భయపడి చస్తారు. అలాంటి ఓ ఏడాది వయసు ఉన్న బాలుడు, నాగుపామునే కరిచి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బెట్టియ్య గ్రామంలోని ఏడాది వయసు ఉన్న బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, ఓ నాగుపాము అతడి చేతికి చుట్టుకుంది. ఆ పసివాడు, అది భయంకరమైన పాము అని తెలియక, దానిని గట్టిగా పళ్లతో కొరికాడు. దీంతో పాము చనిపోయినట్లు […]
Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆ రాష్ట్రంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న హింసనను అడ్డుకుని, శాంతిభద్రతలను పునరుద్ధరించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాష్ట్రంలోని 5 లోయ ప్రాంత జిల్లాల్లో నిర్వహించిన ఆపరేషన్లలో భారత ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
NISAR: భారత్, అమెరికా కలిసి సంయుక్తంగా తయారు చేసిన ‘ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ అయిన ‘‘’NASA ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) శాటిలైట్’’ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సాంకేతిక అద్భుతం, గేమ్ ఛేంజర్‌గా మారుతుందని చెబతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు నుంచి ప్రాణాలను కాపాడేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. 1.3 బిలియన్ డాలర్ల పైగా ఖర్చుతో భారత్, అమెరికాలు కలిసి ఈ శాటిలైట్‌ని రూపొంందించాయి. భారత్ లోని శ్రీహరికోట లాంచింగ్ సెంటర్ నుంచి ఈ […]