Pakistan: పాకిస్తాన్లో మహిళల హక్కులకు ప్రాధాన్యతే లేకుండా పోయింది. ముఖ్యంగా, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టిక్‌టాక్ స్టార్లు హత్యలకు గురవుతున్నారు. వీరిపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా, పాకిస్తాన్ టిక్‌టాక్ స్టార్ సుమీరా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. సింధ్ ప్రావిన్సులోని ఘోట్కి జిల్లాలోని బాగో వా ప్రాంతంలో తన ఇంట్లోనే చనిపోయింది.
Odisha: ఒడిశా బాలాసోర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో అసిస్టెంబ్ ప్రొఫెసర్ భార్యపై అత్యాచారయత్నం జరిగింది. అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. క్యాంపస్‌లోని ప్రొఫెసర్ అధికారిక నివాసంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
TCS: భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతోంది. 2026 ఫైనాన్షియల్ ఇయర్లో తన మొత్తం వర్క్‌ఫోర్స్ నుంచి 2 శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఇది ప్రధానంగా మిడిల్, సీనియర్ మేనేజ్మెంట్ని ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది.
Raj Thackeray: 13 సంవత్సరాలలో మొదటిసారిగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి వెళ్లారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజును సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఠాక్రే చివరిసారిగా 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించిన సమయంలో మాతోశ్రీలోకి ప్రవేశించారు.
Conversion racket: పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న మతమార్పిడి ముఠాను ఆగ్రా పోలీసులు పట్టుకున్నట్లు శనివారం వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ నెట్వర్క్ సోషల్ మీడియా, లూడో స్టార్ వంటి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారామ్స్, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, డార్క్ వెబ్లను ఉపయోగించి పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. క్రౌడ్ ఫండింగ్, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బు లావాదేశీలు జరిగాయని అధికారులు కనుగొన్నారు.
Congress: కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సమయంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఉన్న బీజేపీకి, ఇప్పటి బీజేపీ చాలా మార్పు ఉందని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత నలుగురు సభ్యులతో కార్గిల్ సమీక్ష కమిటిని ఏర్పాటు చేయాలనే వాజ్‌పేయి నిర్ణయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రధానికిగా ఉన్న వాజ్‌పేయికి, ఇప్పుడు ఉన్న ప్రధాని మోడీ వేరు వేరు అని అన్నారు.
Hamas: గతేడాది గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చింది. ఆ సమయంలో యాహ్యా సిన్వార్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గాజాలోని టన్నెల్స్‌లో అత్యంత రహస్యంగా ఉండే సిన్వార్‌ని ఇజ్రాయిల్ బలగాలు ఎంతో ట్రాక్ చేసి, చివరకు హతమార్చింది. ఇదిలా ఉంటే, ఆయన భార్య గాజా నుంచి తప్పించుకుని, టర్కీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
Intel layoffs: మరో టెక్ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. చిప్‌మేకర్ ‘‘ఇంటెల్’’ పునర్నిర్మాణంలో భాగంగా ఏకంగా 25,000 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. 2025 చివరి నాటికి తన ఉద్యోగుల సంఖ్యను 75,000 మందికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది చివరి నాటికి ఇంటెల్‌లో మొత్తం 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు.
PM Modi: తమిళనాడు అభివృద్ధి మా ప్రధాన నిబద్ధత అని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. తూత్తుకూడి ఏయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ని ఆయన శనివారం ప్రారంభించారు. గత దశాబ్ధంతో పోలిస్తే, ఎన్డీయే నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కన్నా ఎక్కువ నిధుల్ని తమిళనాడుకు ఇచ్చిందని అన్నారు. ఒ
NCERT: పాకిస్తాన్ పై భారత్ ఎంతో విజయవంతంగా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాఠ్య పుస్తకాల్లో భాగం కానుంది. సిందూర్‌తో పాటు చంద్రయాన్, ఆదిత్య ఎల్1 అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)’’ వెళ్లిన మిషన్లు పాఠ్యాంశాలుగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేుషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT)లో చేర్చాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భావిస్తోంది.