Maldives: భారత ప్రధాని నరేంద్రమోడీ మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. మాల్దీవులకు అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ ముయిజ్జూ ఆహ్వానం మేరకు ఆ స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరయ్యారు. ముందుగా చైనాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, భారత్ విలువ ఏంటో తెలియడంతో ముయిజ్జూ కాళ్ల బేరానికి రావాల్సి వచ్చింది. ఏ నోటితో ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో అధికారంలోకి వచ్చాడో, ఇప్పుడు అదే నోటితో భారత్‌ని పొగుడుతున్నాడు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఎవరిని అడిగినా మాల్దీవులు ఒక ముస్లిం దేశం అని చెబుతుంటారు, కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ద్వీప దేశం ‘‘బౌద్ధ దేశం’’గా ఉండేదని చాలా తక్కువ మందికి తెలుసు. మాల్దీవులు ఇస్లాంను స్వీకరించిన 896వ వార్షికోత్సవాన్ని రబీ-ఉల్-అఖిర్ రెండవ తేదీ సందర్భంగా జరుపుుకుంటారు. ఇది ఈ దేశం ఇస్లాం స్వీకరించిన రోజు. ఈ మతమార్పిడి కేవలం మతపరమైన మార్పుకే కాకుండా, మాల్దీవుల దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పాలనా వ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది.
Read Also: Lokesh kanagaraj: ఆ స్టార్ హీరో రజనీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు!
మాల్దీవులకు ఇస్లాంను ఎవరు తీసుకువచ్చారు..?
మాల్దీవుల్లో ఇస్లాంకు ముందు బౌద్ధుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ అక్కడి ద్వీపాల్లో బౌద్ధ స్థూపాలు, ఆరామాలు కనిపిస్తుంటాయి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్ధం కాలంలో బౌద్ధమతం మాల్దీవులకు వచ్చిందని భావిస్తున్నారు. అయితే, 12వ శతాబ్ధంలో ఇస్లాం బోధకుడు అబూ అల్-బరాకత్ యూసుఫ్ అల్-బర్బరీ మాల్దీవులకు వెళ్లాడు. ఇతనే ఆ దేశానికి ఇస్లాంను పరిచయం చేశాడు.
కొన్ని చాత్రికత ఆధారాల ప్రకారం, అల్ -బర్బరీ ఉత్తర ఆఫ్రికా, ప్రస్తుత సోమాలియా లేదా ఇరాన్ ప్రాంతాల నుంచి వచ్చినట్లు నమ్ముతారు. ఇతను అప్పటి రాజు ధోవేమిని ఇస్లాం స్వీకరించేలా ప్రేరేపించాడు. ఇస్లాం స్వీకరించిన తర్వాత సుల్తాన్ ముహమ్మద్ అల్-ఆదిల్ పేరులో పాలన సాగించాడు.
Read Also: The Husband: భార్య కోరికలు తీర్చేందుకు దొంగగా మారిన భర్త..
పాలనలో విపరీతమైన మార్పులు:
ఇస్లాం స్వీకరించిన తర్వాత మాల్దీవుల సంస్కృతి, సంప్రదాయాలు, పాలనలో పెద్ద మార్పు వచ్చింది. మతపరమైన విద్య సమాజంలో లోతుగా కలిసిపోయింది. ఇది ఆ దేశ జీవనశైలి, వాస్తు ప్రతీదానిపై ప్రభావం చూపించింది. ఇస్లామిక్ పాలన వచ్చిన తర్వాత, మాల్దీవులు న్యాయ వ్యవస్థలో షరియా చట్టాలు చేరాయి. అనేక శతాబ్ధాలుగా మాల్దీవులు ఇస్లామిక్ సుల్తానేట్‌గా ఉంది. అయితే, 1968లో గణతంత్ర రాజ్యంగా మారింది. కానీ ఇప్పటికీ ఇస్లాం ఆ దేశ రాజ్యాంగానికి, పాలనకు పునాది. ప్రస్తుతం, మాల్దీవుల్లో రాజకీయాల్లో, పరిపాలనలో అక్కడ మసీదులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.