P Chidambaram: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ చర్చకు అంతా అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే, దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడిలో ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’’ పాల్గొనవచ్చని ఆయన అన్నారు. హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఏక్కడ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తానే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చేసేలా ఒప్పించానని చెప్పాడు. ఇప్పటికే ఈ విషయాన్ని 20 కన్నా ఎక్కువ సార్లు ట్రంప్ చెప్పాడు. మరోవైపు, ట్రంప్ వ్యాఖ్యలపై భారతదేశంలో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. ప్రధాని మోడీ ట్రంప్‌కు లొంగిపోయాడని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇలా ఉంటే, పాకిస్తాన్ డీజీఎంఓ, భారత డీజీఎంఓకి కాల్ చేసి, కాల్పుల విరమణను కోరడంతోనే సాధ్యమైందని, ట్రంప్ మాటల్లో నిజం లేదని…
UP temple: సోమవారం తెల్లవారుజామున ఉత్తర్ ప్రదేశ్‌లోని హైదర్‌గఢ్ అవసనేశ్వర్ మహాదేశ్ ఆలయంలో తొక్కసిలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించిగా, 40 మందికిపైగా గాయపడ్డారు. విద్యుత్ తీగ టిన్ షెడ్‌పై పడి అనేక మందికి విద్యుత్ షాక్ వచ్చినట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Kissing: బ్యాంకు మహిళా ఉద్యోగిపై అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు రూ. 1000 జరిమానా విధించడంతో పాటు ఒక ఏడాది కఠిన జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన ముంబైలోని బోరివలిలో జరిగింది. 2020లో అధికారిక చిరునామాను ధ్రువీకరించేందుకు నిందితుడి నివాసానికి వచ్చిన, మహిళా ఉద్యోగిని పట్ల 54 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. Read Also: Hyderabad: భర్తను చంపేందుకు భార్య స్కెచ్.. బీర్ బాటిల్స్ తో దాడి.. చనిపోయాడనుకొని.. నరేంద్ర రఘునాథ్ సగ్వేకర్ అనే […]
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృష్టించారు. యూపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు ఈ పదవిలో ఉన్నారు, కొనసాగుతున్నారు. అంతకు ముందు ఉన్న గోవింద్ వల్లభ్ పంత్ రికార్డును యోగి అధిగమించారు. పంత్ యూపీకి ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల 127 రోజులను యోగి అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు.
Love Jihad: ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతంతోకి మార్చుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘లవ్ జిహాద్’’ ముఠాను ఉత్తర్ ప్రదేశ్ కుషినగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. సునీల్ వర్మ అనే వ్యక్తి, తన 19 ఏళ్ల కుమార్తెను ప్రలోభపెట్టి అమృత్సర్ తీసుకెళ్లారని, అక్కడ ఆమెను బలవంతంగా మతం మార్చి, దాచిపెట్టారని ఫిర్యాదు దాఖలు చేయడంతో ఈ అరెస్టులు జరిగాయి.
Tariff Deadline: సుంకాల విధింపుకు సంబంధించి డెడ్‌లైన్ గురించి అమెరికా క్లారిటీ ఇచ్చింది. సుంకాలు విధించడానికి ఆగస్టు 1నాటి తుది గడువు ఎట్టి పరిస్థితుల్లో మారదని, ఎలాంటి పొడగింపులు ఉండవని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆదివారం చెప్పారు. ‘‘ఇక పొడగింపులు లేవు, ఇక గ్రేస్ పిరియడ్లు లేవు. ఆగస్టు 1న, సుంకాలు నిర్ణయించబడ్డాయి. అవి అమలులోకి వస్తాయి. కస్టమ్స్ డబ్బు వసూలు చేయడం ప్రారంభిస్తాయి.’’ అని ఓ అన్నారు.
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు వాడీవేడీ చర్చ జరగబోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు లోక్‌సభలో చర్చ జరగనుంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సిందూర్‌పై చర్చకు అధికార పక్షం తరుపు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు. ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా చర్చలో పాల్గొంటారని […]
Wife kills husband: భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. భార్య, ఆమె లవర్ ఇద్దరూ కలిసి అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగింది. భార్య, ఆమె లవర్ ఇద్దరు శృంగారం చేస్తుండగా భర్తకు దొరికారు. దీని తర్వాత కొన్ని రోజులకే వారిద్దరు కలిసి భర్తను హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోలీసులు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.
Danish Kaneria: పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్లతో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మ్యాచ్ నుండి వైదొలిగినందుకు మాజీ పాకిస్తాన్ బౌలర్ డానిష్ కనేరియా భారత క్రికెటర్లను విమర్శించారు. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ మాజీ స్పిన్నర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మీకు అనుకూలమైనప్పుడు దేశభక్తిని ఉపయోగించడం మానేయండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఖరారైన తర్వాత భారత క్రికెటర్లపై విమర్శలు గుప్పించారు.