Google CEO Sundar Pichai Receives Padma Bhushan In California: టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ అవార్డును ప్రధానం చేశారు అమెరికాలోని భారత రాయబారి. 2022లో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ ఏడాది 17 మందికి అవార్డుల్లో ప్రకటిస్తే అందులో సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోతో తన సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య భారతదేశ మూడో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, సుందర్ పిచాయ్ కి ఈ పురస్కారాన్ని అందించారు.
Read Also: USA: భారత్‌కు అమెరికా అండగా ఉంటుంది.. మీకు సంబంధం లేదని చైనాకు వార్నింగ్
ఈ అవార్డును అందించినందుకు భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సుందర్ పిచాయ్. ఈ విధంగా భారతదేశం తనను గౌరవించడంపై ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశం నాలో భాగంగా ఉందని.. ఎక్కడికి వెళ్లినా ఇండియా నాతోనే ఉంటుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో మంచి అవకాశాలను అందించిన తల్లిదండ్రులకు, తాను ఇలా ఎదగడంతో సహాయపడిన కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
భారతదేశంలో సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. భారతదేశం ఆవిష్కరించిన డిజిటల్ చెల్లింపుల విధానం ప్రపంచ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని పిచాయ్ అన్నారు. భారత్, గూగుల్ భాగస్వామ్యం మరింతగా బలపడాలని ఆయన ఆకాంక్షించారు. భారతదేశంలో వ్యాపారాలు సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకున్నాయని.. గ్రామీణ ప్రాంతాలకు కూడా మునుపెన్నడూ లేనంత వేగంగా ప్రజలు ఇంటర్నెట్ పొందుతున్నారని పిచాయ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఇండియాలో టెక్నాలజీ వేగంగా పెరుగుతుందని ఆయన అన్నారు.