High salt is a threat to heart health: మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఉప్పు అనేది కీలకం. సోడియం మనశరీరంలో ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చెస్తుంది. కండరాలు, నరాల కదలికలకు సహాయపడుతుంది. మితంగా తీసుకుంటే ఉప్పు శరీరానికి సహాయకారిగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఉప్పు అధికంగా తీసుకుంటామో అప్పుడు గుండె, కిడ్నీలు, నరాలపై ప్రభావం పడుతుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీల వైఫల్యానికి, గుండెపొటుకు కారణం అవుతుంది.
Read Also: Covid-19: చైనాలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి.. ప్రజావ్యతిరేకతతో లాక్‌డౌన్ సడలింపులు
రక్తనాళాలను దెబ్బతీస్తుంది:
ఉప్పు అధికంగా ఉంటే ఇది రక్తంప్రవాహ సమయంలో నీటిని ఆకర్షిస్తుంది. దీంతో రక్తంనాళాల్లో రక్త పరిమాణం పెరుగుదలకు దారితీస్తుంది. రక్తనాళాల ద్వారా ఎక్కువ రక్తం ప్రవహించడం వల్ల బీపీ పెరుగుతుంది. సులభంగా చెప్పాలంటే ఒక పైపులో వాటర్ వెళ్తున్నప్పుడు దాని ద్వారా ఎక్కువ నీటిని పంప్ చేస్తే ఎలాగైతే ఒత్తడి పెరుగుతుందో రక్తనాళాల్లో కూడా ఒత్తడి పెరుగుతుంది. కాలక్రమేనా హైబ్లడ్ ప్రెజర్ రక్తనాళాలను దెబ్బతీస్తాయి. రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతాయి. దీంతో పాటు ఊబకాయం వంటి సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి. నిజానికి బీపీని ‘‘ సైలెంట్ కిల్లర్’’గా అభివర్ణిస్తుంటారు. ఇది శరీరంలో జబ్బులకు తెలియకుండానే కారణం అవుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులకు అధికంగా ఉప్పు తీసుకోవడం కారణం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు గుండె జబ్బులే కారణం అవుతున్నాయి.
గుండెతో పాటు కిడ్నీలపై ప్రభావం:
ఒక వేళ మీకు ఇప్పుడు అధిక రక్తపోటు లేకపోయినా.. తక్కువగా సోడియం తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే రక్తపోటును తగ్గించవచ్చు. గుండె ఆరోగ్యంతో పాటు బీపీ అనేది కిడ్నీపై ప్రభావం చూపుతుంది. రక్తం అధిక పీడనం వల్ల కిడ్నీలోని రక్తాన్ని వడపోసే నెఫ్రాన్లు క్రమంగా దెబ్బతినడం ప్రారంభం అవుతాయి. దీర్ఘకాలంలో కిడ్నీ వైఫల్యాలకు కారణం అవుతాయి. మూత్రపిండాల వ్యాధి, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, స్టమక్ క్యాన్సర్లకు అధిక ఉప్పు ఓ రకంగా కారణం అవుతుంది.
ఉప్పును ఇలా తగ్గించండి:
సహజంగా ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో కేలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్యాక్డ్ ఫుడ్ లో ఉప్పు అధికంగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన ఉప్పులో 15 శాతం మన ఆహారంలోనే ఉంటుంది. మిగిలిన 80 శాతం మనం వంట చేసేటప్పుడు కలుపుతుంటాము. ఇది ఆహారానికి రుచిని ఇస్తుంది. తాజాపండ్లు, తాజా మాంసాన్ని తీసుకోవడం వల్ల ఉప్పును తగ్గించే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్ తీసుకోవడం మానేయాలి.