బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌ను బంధించి చిత్రహింసలు పెట్టే క్లైమాక్స్ సీన్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ సీన్ తెరకెక్కించడం వెనుక విక్కీ కౌశల్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను విక్కీ పంచుకున్నారు.
Also Read : Nidhi Agarwal, Chinmayi : ఫ్యాన్స్ ముసుగులో మృగాలు! నిధి అగర్వాల్ ఘటనపై చిన్మయి ఫైర్
‘ఆ టార్చర్ సీన్ షూటింగ్ మొదలైన మూడో రోజే నేను తీవ్రంగా గాయపడ్డాను. దానివల్ల నెలన్నర పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అంత కష్టపడి వేసిన సెట్‌ను కూడా తీసేశారు. మళ్ళీ రెండు నెలల తర్వాత 12 రోజుల పాటు శ్రమించి అదే సెట్‌ను మళ్ళీ వేశారు. శంభాజీ మహరాజ్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే పట్టుదలతో మేమంతా ఆ సీన్ కోసం ప్రాణం పెట్టి పనిచేశాం’ అని విక్కీ ఎమోషనల్ అయ్యారు. ఆ కష్టానికి తగ్గట్టుగానే థియేటర్లలో ఆ సీన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.