Muslims vs RSS: ముస్లింలు సూర్య నమస్కారాలు, నదులను పూజించాలి.. ఆర్ఎస్ఎస్ నేత హాట్ కామెంట్స్
- తీవ్ర దుమారం రేపుతున్న ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబలే వ్యాఖ్యలు..
- ముస్లింలు సూర్య నమస్కారాలు, నదులను పూజించాలి.. మసీదులకు వెళ్లకుండా ఎవరు అడ్డుకోరు..
- ప్రతి ఒక్కరు తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది.. మతాలకంటే “మానవ ధర్మం” ముఖ్యం: హోసబలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muslims vs RSS: ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందూ మతం “సర్వోన్నతమైనది”.. భారతదేశంలోని ముస్లింలు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం నదులు, సూర్యుడిని ఆరాధించాలని సూచించారు. అలాగే, ముస్లిం సోదరులు సూర్య నమస్కారం చేస్తే వారికి ఎలాంటి నష్టం జరగదని, అలా చేసినంత మాత్రాన మసీదుకు వెళ్లకుండా ఎవరు అడ్డుకోరని ఆయన అన్నారు. సూర్య నమస్కారం ఆరోగ్యానికి మేలు చేసే యోగ సాధనంగా అభివర్ణించారు. ప్రార్థనలు చేసే వారు ప్రాణాయామం చేయడంలో తప్పేముందని ప్రశ్నించిన ఆయన, నమాజ్‌ను వదిలేయమని చెప్పడం లేదన్నారు. ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది.. మతాలకంటే ముందు “మానవ ధర్మం” ముఖ్యమని హోసబలే వ్యాఖ్యానించారు.
Read Also: Vicky Kaushal: శంభాజీ మహరాజ్ పాత్ర కోసం విక్కీ ఇంత త్యాగం చేశాడా.. !
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
కాగా, ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ విభజన అంశాన్ని ప్రస్తావించిన హోసబలే.. పార్టిషన్ సమయంలో హిందువులకు ఏమి జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. అలాగే, హిందూ తత్వశాస్త్రంలో ప్రకృతి, జీవజాలంపై అహింసను బోధిస్తుంది, దేవతల పేర్లను పిల్లలకు పేర్లు పెట్టుకునే సంప్రదాయం భారతదేశానికి ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. అయితే, “హిందూ మతం సర్వోన్నతమైనది” అనే వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇవి ఒక మతాన్ని మరొక మతంపై ఆధిపత్యంగా చూపిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, “మసీదుకు వెళ్లడాన్ని ఆపం” అనే వ్యాఖ్యల్లో ముస్లింలను హిందూ మెజారిటీ సంస్కృతిలో కలిపివేయాలనే భావన ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. హిందూ ఆచారాలను కేవలం మతపరమైనవిగా కాకుండా, ఆరోగ్యం, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ పేరుతో సామాన్యమైన పౌర సంస్కృతిగా చూపించాలని ఆర్ఆర్ ప్రయత్నిస్తుందని మరికొందరు విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!