F-35 Fighter Jets: అమెరికాకు చెందిన అత్యాధునిక, 5వ తరం ఫైటర్ జెట్ F-35 విమానాల కోనుగోలుపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ వాషింగ్టన్ పర్యటన తర్వాత భారత్ ఈ విమానాలను కొనుగోలు చేయాలని అమెరికా ప్రతిపాదించింది.
Shashi Tharoor: భారతదేశంపై 25 శాతం సుంకాలను విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను ‘‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థ’’గా అభివర్ణించాడు. అయితే, ట్రంప్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సమర్థించాడు. భారత ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’ అని రాహుల్ గాంధీ చెప్పడంపై పలువురు కాంగ్రెస్ ఎంపీలు విభేదిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ.. ‘‘ ట్రంప్ వ్యాఖ్యలు నిజం…
Malegaon blast: 2008 మలేగావ్ కేసు దర్యాప్తు సమయంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS)లో కీలక అధికారి అయిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ మెహిబూబ్ ముజావర్ సంచలన వ్యాక్యలు చేశారు. ఈ కేసులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను అరెస్ట్ చేయాలని తనను కోరారని చెప్పారు. బీజేపీ ఎంపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌తో సహా ఈ కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక NIA కోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందనగా గురువారం రిటైర్డ్ ఇన్స్పెక్టర్ మెహిబూబ్ ముజావర్ ఈ వాదన చేశారు.
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నాడు. ఇప్పటికే భారత్ సహా పలు ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించాడు. భారత్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ అధిక సుంకాలను విధిస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశాడు. 69 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 10 శాతం నుంచి 41 శాతానికి పెరిగిన ఈ వాణిజ్య సుంకాలు ఏడు రోజుల్లో అమలులోకి రానున్నాయి.
Pahalgam terrorists: జమ్మూ కాశ్మీర్లో రెండు నెలల క్రితం అమాయమైన 26 మంది టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘‘ది రెస్టిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు చంపేశారు. ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకుల్ని మతం పేరు అడుగుతూ చంపేశారు. ఈ ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారు.
Honour killing: తమిళనాడులో 25 ఏళ్ల దళిత యువకుడి హత్య సంచలనంగా మారింది. దీనిని ‘‘పరువు హత్య’’గా భావిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన కవిన్ తిరునెల్వెలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి సమీపంలో హత్యకు గురయ్యాడు. కవిన్ ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కేటీసీ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నా తన మాజీ స్కూల్ విద్యార్థినితో సంబంధం ఉందని తెలుస్తోంది. అమ్మాయి కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చినా, కవిన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు.
XXX vs Union of India: జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో ఓ అగ్నిప్రమాదంలో వందల కోట్ల నగదు పట్టుబడింది. ఈ కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే, తనను తొలగించాని సిఫార్సు చేసిన విచారణ ప్యానెల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
Operation Sindoor: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు పార్లమెంట్లో చర్చ జరగబోతోంది. చర్చకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. దీనిపై కేంద్రం తరుపున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అమిత్ షా మాట్లాడుతారని తెలుస్తోంది. సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
Tech layoffs: అనేక టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నారు. ఈ పరిణామాలు టెక్కీల్లో ఆందోళన నింపుతోంది. తాజాగా, దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(TCS) 12000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. మారుతున్న వ్యాపార అవసరాలు, ఖర్చుల్ని తగ్గించకునేందుకు ఇలా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. మరోవైపు, కృత్రిమ మేధస్సు (AI) ప్రభావానికి అనుగుణంగా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ కోతలు సామర్థ్యం, పునర్నిర్మాణంలో భాగంగా చేస్తున్నామని చెబుతోంది.
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో ‘‘గబ్బిలాల’’ వేట కలకలం రేపుతోంది. గబ్బిలాలను చంపి, వాటిని సమీపంలో హోటల్స్‌లో చిల్లీ చికెన్‌లా తయారు చేస్తున్న ముఠా పట్టుబడింది. సేలం జిల్లా డేనిష్ పేటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డానిష్ పేటలోని అటవీ ప్రాంతంలో తుపాకులతో గబ్బిలాలను వేటాడుతున్న సెల్వం, కమల్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. Read Also: CIBIL Score: గూగుల్ పేలో ఒక్క క్లిక్‌తో సిబిల్ స్కోర్.. ఇలా చెక్ చేసుకోండి […]