Operation Akhal: శుక్రవారం జమ్మూ కాశ్మీర్ కుల్గామ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్కౌంటర్ ‘‘ఆపరేషన్ అఖల్’’లో భాగంగా జరిగింది. ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో అనుబంధంగా ఉన్నారని మరియు ఇటీవలి పహల్గామ్ దాడితో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు.
PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘‘డెడ్ ఎకానమీ’’గా పొల్చారు. రష్యాతో భారత సంబంధాలను ఉద్దేశిస్తూ, రెండు దేశాలు ఆర్థిక వ్యవస్థలు చనిపోయే స్థితిలో ఉన్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
Pinarayi Vijayan: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమాకు రెండు ప్రధాన అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు ప్రకటించని కొన్ని గంటల్లోనే కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు అవార్డులు ఇచ్చి కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఇలాంటి చిత్రాన్ని సత్కరించడం ద్వారా కేంద్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని సీఎం అన్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్న హతం చేయడానికి భద్రతా బలగాలు ‘‘ఆపరేషన్ మహదేవ్’’ నిర్వహిస్తోంది. తాజాగా, కుల్గాంలోని అకల్ దేవ్సర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్కౌంటర్ ప్రారంభమైంది. సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Kiren Rijiju: భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమర్థించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’అని ట్రంప్ చెప్పడాన్ని రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. అయితే, ఈ విషయంపై కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఆయనను విమర్శించారు. ప్రతిపక్ష నేత ‘‘చిన్నపిల్లవాడు కాదు’’ అని, దేశ ప్రతిష్టను ఈ విధంగా దెబ్బతీయకూడదని తెలుసుకోవాలని హితవు పలికారు. ‘‘రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా […]
Nimisha Priya Case: యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటుున్న కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. మరణశిక్ష రద్దు నివేదికల్ని భారత్ తిరస్కరించింది. ఈ కేసుపై భారత్, యెమెన్‌తో కలిసి పనిచేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) తెలిపింది.
Bride: ఆమెకు అప్పటికే 8 మంది పురుషులతో వివాహమైంది. పెళ్లి చేసుకోవడం ఎంచక్కా భర్తల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకుంది. చివరకు 9వ పెళ్లి చేసుకునే సమయంలో పోలీసులకు పట్టుబడింది ఈ కిలాడీ ‘‘నిత్య పెళ్లికూతురు’’. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పురుషులను వివాహం చేసుకుని, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
Odisha: ఒడిశాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గణపతి జిల్లాలో ఓ ఉన్నతాధికారికి ప్యూన్ తాగునీటికి బదులుగా ‘‘మూత్రం బాటిల్’’ ఇచ్చాడు. అది తాగిన సదరు అధికారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ కేసులో ప్యూన్‌ను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామీణ నీటి సరఫారా, పారిశుధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సచిన్ గౌడకు నిందితుడైన ఫ్యూన్ సిబా నారాయణ్ నాయక్ మూత్ర బాటిల్ ఇవ్వడం సంచలనంగా మారింది.
India On US Tarrifs: భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాలు విధించడం, రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. అయితే, అమెరికా కామెంట్లపై భారత్ శుక్రవారం ఘాటుగానే స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం ఈ విషయం గురించి మాట్లాడారు. ‘‘మా ఇంధన అవసరాలను తీర్చడంలో, మార్కెట్లో అందుబాటులో ఉన్న, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ద్వారా నిర్ణయం తీసుకుంటాము’’ అని జైస్వాల్ చెప్పారు.
US tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే, అమెరికా విధించిన సుంకాలను పట్టించుకునే పరిస్థితి లేదని, భారతదేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఎగుమతులు, దేశ జీడీపీపై తక్కువ ప్రభావం ఉంటుందని, భారతదేశంలో వ్యవసాయం, పాడిపరిశ్రం, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (MSMEలు) వంటి కీలక రంగాలు రక్షించబడతాయని విషయం తెలిసిన […]