Delhi Acid Attack: ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు నిందితుడు. బుధవారం ఉదయం రోడ్డుపై చెల్లితో నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిపై ఇద్దరు నిందితులు బైక్ పై వచ్చి ముఖంపై యాసిడ్ తో దాడి చేశారు. ఈ కేసులో బాధితురాలుకు తెలిసిన ఇద్దరు వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన వివరాలతో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. దాడికి ఉపయోగించిన యాసిడ్ ను ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు…
Woman hacked to death in public by partner in Kerala: లివ్ ఇన్ రిలేషన్ షిప్ మహిళల ప్రాణాలను తీస్తోంది. నమ్ముకున్నవారే నరికి చంపుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ ఉదంతమే. తాజాగా కేరళలో కూడా శ్రద్ధావాకర్ తరహాలోనే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న యువతిని ఆమె లవర్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురం శివార్లలోని వజ్హయిల సమీపంలో ఈ ఘటన జరిగింది.
Tweet war between Anurag Kashyap and Vivek Agnihotri: ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో కాంతారా, పుష్ప సినిమాలు బాలీవుడ్ ను నాశనం చేస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాటల మంటలు చెలరేగుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్యప్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. అనురాగ్ కశ్యప్ ఇంటర్వ్యూ స్క్రీన్ షాట్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి..‘‘ బాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ మిలార్డ్ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవించను.. మీరు అంగీకరిస్తారా..?’’…
Why Do You Say Jai Sree Ram, Not Jai Siyaram ? Rahul Gandhi To RSS, BJP: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మహిళలను అణచివేస్తోందని అన్నారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’లో ఆర్ఎస్ఎస్, బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రణాళిక అని బుధవారం అన్నారు. భయం, ద్వేషానికి వ్యతిరేకంగా నిలిచేందుకే భారత్ జోడో యాత్ర అని అన్నారు. రాముడు, సీతాదేవిని సూచించే…
Rope from truck wraps biker's neck in freak road accident in Tamil Nadu: ఆవగింజంత అదృష్టం ఉన్నా చాలు ఎంతటి విపత్తుల నుంచైనా తప్పించుకోవచ్చు. ఎలాంటి ప్రమాదాల్లో అయినా సురక్షితంగా ఉండొచ్చు. సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అద్భుతరీతిలో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే తూత్తుకూడిలో ఎదురెదురుగా లారీ, బైకు వస్తున్న క్రమంలో లారీకి వేలాడుతున్న తాడు యువకుడి మెడకు చుట్టుకుంది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే అదృష్టం…
Maharashtra-Telangana border issue: ఇటీవల కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం రాజుకుంటోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 14 గ్రామాల పరిస్థితి విచిత్రంగా ఉంది. తెలంగాణ సరిహద్దు మహారాష్ట్ర జిల్లా అయిన చంద్రపూర్ లోని మారుమూల జివటీ తాసీల్ పరిధిలో ఉన్నాయి. భౌగోళికంగా ఈ గ్రామాలు మహారాష్ట్రలో ఉన్నప్పటికీ.. తెలంగాణపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పథకాలు ఈ గ్రామాల్లోను వర్తిస్తున్నాయి. ఇక రెండు రాష్ట్రాల ఓటర్ జాబితాలో కూడా ఈ…
High blood pressure causes dementia: అధిక రక్తపోటు(హై బీపీ) శరీరంలో సైలెంట్ కిల్లర్. సైలెంట్ గా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. గుండె, మెదడు కిడ్నీలు, రక్తనాళాలు ఇలా ప్రతీ అవయవంపై అధిక రక్తపోటు ప్రభావం పడుతుంది. తాజాగా హైబీపీ మతిమరపు(డిమెన్షియా)కారణం అవుతుందని తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన ‘ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబర్ హెల్త్’ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధిక రక్తపోటు అదుపులో లేకపోతే మెదడులోని కొన్ని భాగాల్లో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయని తేలింది. దీంతో మెదడుకు…
Union Minister Ashwini Vaishnaw on concessions in Railways: రైళ్లలో వయోవృద్ధులకు ఇచ్చే రాయితీలై కీలక ప్రకటన చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్. వయో వృద్ధులకు ఇచ్చే రాయితలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని స్పష్టం చేశారు. రైల్వేలో ఫించన్లు, ఉద్యోగులు జీతాల భారం అధికంగా ఉందని.. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు రాయితీను పునరుద్ధరించడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన పార్లమెంట్ లో వెల్లడించారు.
Muslim community orders not to play DJ music during Nikah: ప్రస్తుతం ఏ శుభకార్యం అయిన డీజే మ్యూజిక్, లౌడ్ సౌండ్ తో పాటలు ప్లే చేయడం పరిపాటిగా మారింది. అయితే ముస్లిం వివాహ సమయాల్లో మాత్రం డీజేని పెట్టవద్దని ముస్లింమత సంఘం సూచించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ముస్లిం మహాసభ మతపెద్దలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిఖా సమయంలో బ్రాస్ బ్యాండ్స్, డీజే ప్లే చేయవద్దని కోరింది. సాధారణ పద్దతిలోనే ‘నిఖా’ చేసుకోవాలని.. అందుకు మత…
protest against Pathaan movie in Indore: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘ పఠాన్’ మూవీకి నిరసన సెగ తగులుతోంది. మరో బాలీవుడ్ సినిమాకు ‘బాయ్ కాట్’ సెగ తగులుతోంది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హిందువలు మనో భావాలను దెబ్బతీసినందుకు ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాపై సీరియస్ గా ఉంది.