Muslim community orders not to play DJ music during Nikah: ప్రస్తుతం ఏ శుభకార్యం అయిన డీజే మ్యూజిక్, లౌడ్ సౌండ్ తో పాటలు ప్లే చేయడం పరిపాటిగా మారింది. అయితే ముస్లిం వివాహ సమయాల్లో మాత్రం డీజేని పెట్టవద్దని ముస్లింమత సంఘం సూచించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ముస్లిం మహాసభ మతపెద్దలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిఖా సమయంలో బ్రాస్ బ్యాండ్స్, డీజే ప్లే చేయవద్దని కోరింది. సాధారణ పద్దతిలోనే ‘నిఖా’ చేసుకోవాలని.. అందుకు మత పెద్దలు చొరవ చూపాలని కోరింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. వివాహ కార్యక్రమాల్లో అధికంగా డబ్బును ఖర్చు చేయడాన్ని ఈ సంస్థ వ్యతిరేకిస్తోంది. భవిష్యత్తులో డీజే కల్చర్ ను ప్రోత్సహించబోమని సదరు కుటుంబాల నుంచి లిఖితపూర్వక హామీ కూడా తీసుకోవాలని ముస్లిం మహాసభ ప్రకటనలో పేర్కొంది.
Read Also: Pathaan: పఠాన్ మూవీకి షాక్.. షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మ దహనం
దీనికి ముందు జార్ఖండ్ లోని ధన్‌బాద్ జిల్లాలో ముస్లిం మతపెద్దలు పెళ్లిళ్ల సమయంలో డ్యాన్స్, పెద్దగా మ్యూజిక్ ప్లే చేయడాన్ని, బాణాసంచా కాల్చడం వంటి ఇస్లామిక్ విరుద్ధ చర్యలను నిషేధించారు. ఈ ఆజ్ఞను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. సిబిలిబడి జామా మసీద్ చీఫ్ మౌలానా మసూదర్ అక్తర్ మాట్లాడుతూ.. ఇస్లాంలో ఇటువంటి పద్ధతులు అనుమతించబడవని.. ఇది ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఉత్తర్ ప్రదేశ్ ముస్లిం మహాసభ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి.