High blood pressure causes dementia: అధిక రక్తపోటు(హై బీపీ) శరీరంలో సైలెంట్ కిల్లర్. సైలెంట్ గా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. గుండె, మెదడు కిడ్నీలు, రక్తనాళాలు ఇలా ప్రతీ అవయవంపై అధిక రక్తపోటు ప్రభావం పడుతుంది. తాజాగా హైబీపీ మతిమరపు(డిమెన్షియా)కారణం అవుతుందని తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన ‘ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబర్ హెల్త్’ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధిక రక్తపోటు అదుపులో లేకపోతే మెదడులోని కొన్ని భాగాల్లో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయని తేలింది. దీంతో మెదడుకు సరిగ్గా రక్తం అందదు. దీంతో క్రమంగా మెదడు బలహీనపడుతుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గి మతిమరుపుకు దారి తీస్తుందని వెల్లడించింది. వైద్య పరిభాషలో దీన్ని ‘హైపర్ టెన్షన్ అసోసియేటెడ్ వాస్క్యులర్ డిమెన్షియా’ అంటారు.
Read Also: Pathaan: పఠాన్ మూవీకి షాక్.. షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మ దహనం
బీపీ నియంత్రణలో లేకపోతే రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 28 వేల మందికి పైగా రోగులపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారు పరిశోధకులు. సగటున రోగుల వయసు 69 ఏళ్లు ఉంది. దీర్ఘకాలంగా హైబీపీని అదుపులో ఉంచుకున్న వారికి మతిమరుపు బారిన పడే అవకాశాలు తగ్గినట్లు పరిశోధకులు తేల్చారు. హైబీపీ నియంత్రణలో లేకపోతే మతిమరుపు కారణంగా వ్యక్తులను, సంఘటనలను మరిచిపోవడంతో పాటు ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేరు. వ్యక్తులను గుర్తుపట్టినా.. వారి పేర్లు గుర్తురాక తికమకపడుతుంటారు.
అధిక ఉప్పు వినియోగం హైబీపీకి 30 శాతం కారణం అవుతోంది. శారీరక శ్రమ తగ్గడం 20 శాతం, స్థూలకాయం 30 శాతం, ఇతర కారణాలు 20 శాతం హైబీపీకి కారణం అవుతున్నాయి. దీర్ఘకాలికంగా విటమిన్ బీ1, బీ 12 లోపాలు, హైపోథైరాయిడిజం, షుగుర్ వ్యాధులు కూడా మతిమరుపుకు ఇతరత్రా కారణాలు. దీర్ఘకాలిక మూత్రపిండాలు, గుండె, కాలేయం, పక్షవాతం, పార్కిన్సన్ వ్యాధులు కూడా మతిమరుపుకు కారణం అవుతున్నాయి.