Worker Can Not Take Up Moonlighting As Per Rule says Labour Minister In Parliament: ఈ మధ్య ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘‘మూన్‌లైటింగ్’’. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే మరో కంపెనీకి కూడా పనిచేయడాన్ని మూన్‌లైటింగ్ గా పేర్కొంటారు. ఇటీవల దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మూన్‌లైటింగ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఒకేసారి 300 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఒక్కసారిగా ఐటీ రంగంలో ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. మూన్‌లైటింగ్ పద్దతిని విడనాడకుంటే…
Russia Says Shot Down 4 US-Made Missiles, 1st Such Claim Since Ukraine War: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. రష్యా ఏకపక్షంగా యుద్ధాన్ని ముగించేలా కనిపించడం లేదు. ఇక ఉక్రెయిన్ కూడా వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంలో రష్యాతో పోరాడుతోంది. అయితే యుద్ధం వల్ల ఉక్రెయిన్ దేశం సర్వనాశనం అవుతోంది. రష్యా, అమెరికాల వివాదం మధ్య ఉక్రెయిన్ యుద్ధ భూమిగా మారుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు చర్చలపై మాట్లాడుతూ..…
FIR filed in Lucknow for morphing CM Yogi's image in place of Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘ పఠాన్ ’ వరసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’పాట మొత్తం వివాదానికి కేంద్రంగా మారింది. ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొణే బికినీపై, కొన్ని పదాలు, అశ్లీలతపై బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసభ్యకరమైన సన్నివేశాలు తొలిగిస్తేనే సినిమాకు అనుమతి ఇస్తామని, లేకపోతే…
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ సర్వనాశనం అవుతున్నాయి. దీంతో పాటు మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ నగరాలు రష్యా క్షిపణి దాడుల్లో దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం రష్యా 70కి పైగా మిస్సైళ్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది.
Massive protest at Belagavi for no to maha mela, sec 144 imposed: కర్ణాటక, మహారాష్ట సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లోని కోగ్నోలి టోల్ ఫ్లాజా దగ్గర వందలాది మంది మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఇఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కార్యకర్తలు, నాయకులు సోమవారం పెద్దఎత్తున నిరసన తెలిపారు. మహామేళాకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో సీఎం బస్వరాజ్ బోమ్మైకి వ్యతిరేకంగా అంతర్ రాష్ట్ర సరిహద్దు బెలగావికి సమీపంలో నిరసన తెలిపారు.
Maharashtra MLA Attends Assembly With Her Baby: మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు నాగ్‌పూర్‌లోని మహారాష్ట్ర అసెంబ్లీకి తన రెండున్నర నెలల పాపతో మహిళా ఎమ్మెల్యే వచ్చారు. డియోలాలి నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ ) ఎమ్మెల్యేగా ఎన్నికైన సరోజ్ అహిరే శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు చంటి బిడ్డతో వచ్చారు. బిడ్డను చేతిలో పట్టుకుని అసెంబ్లీలో నడుస్తున్న ఎమ్మెల్యే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
China has deployed drones and warplanes along the border: జిత్తులమారి చైనా భారత సరిహద్దు వెంబడి యుద్ధ విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది. సరిహద్దు వెంబడి పలు ఎయిర్ బేస్ లను నిర్మించిన చైనా దాని వెంబడి సైనిక మోహరింపును పెంచుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఘర్షణల తర్వాత డ్రాగన్ కంట్రీ తన కుతంత్రాలకు పదును పెడుతోంది. హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు చైనా మోహరింపును స్పష్టంగా చూపిస్తున్నాయి. భారత ఈశాన్య ప్రాంతానిక అతి దగ్గరలో వీటిని మోహరించింది.
INS Mormugao, a P15B stealth-guided missile destroyer, commissioned into the Indian Navy: భారత నౌకాదళంలోకి కొత్తగా వార్ షిప్ ఐఎన్ఎస్ మోర్ముగోను ప్రవేశపెట్టారు. దీంతో భారత నౌకాదళం మరింతగా శక్తివంతం కానుంది. స్టెల్త్-గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకను ఆదివారం భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రితో పాటు సీడీఎస్ అనిల్ చౌమాన్, నేవీ చీఫ్ అడ్మినరల్ ఆర్ హరికుమార్, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, గోవా…
Block on Xiaomi India’s Rs. 3700 crore deposits removed by court: చైనా మొబైల్ దిగ్గజం ‘షియోమీ’కి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇండియాలో ఆర్థికపరమైన నేరాలకు పాల్పడుతున్న కారణంగా ఆ సమస్యపై భారత ప్రభుత్వం పలు కేసులను మోపింది. దీంతో ఇండియాలో షియోమీ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వివిధ కారణాల వల్ల ఆ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలోని రూ.3700 కోట్ల డిపాజిట్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లాక్ చేసింది.
Physical assault on minor girl: దేశంలో అత్యాచార ఘటనలు రోజుకు ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. మృగాళ్లు తమ కామాన్ని తీర్చుకునేందుకు బాలికలు, మహిళపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు తీసుకుని వచ్చినప్పటికీ.. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. అయితే ఈ తరహా కేసుల్లో బయటకు వస్తున్నవి కొన్నే. కొంతమంది పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు.