UP Man Kills Live-In Partner: ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో సహజీవనంలో ఉన్న తమ భాగస్వామని హత్య చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఓ హత్యే తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు తనతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళను ఏడు నెలల క్రితం చంపేసినట్లు పోలీసులు గుర్తించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నిందితుడు రామన్, తనతో సహజీవనంలో ఉన్న మహిళ కనిపించడం లేదని మే20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు మహిళకు రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. పోలీసులు విచారణలో ఈ కేసులో విస్తూపోయే నిజాలు బయటకు వచ్చాయి. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) దీక్షా శర్మ మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన మహిళను రామన్ చంపాడని.. ఆ తరువాత ఆమె మిస్ అయినట్లు ఇందిరాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని వెల్లడించారు.
Read Also: Christmas: భారత్ సాధువుల భూమి.. శాంటాక్లాజ్‌ది కాదు.. వీహెచ్‌పీ వార్నింగ్
అయితే ముందుగా రామన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే విచారణలో పెళ్లి విషయంలో వివాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే హిమాచల్ ప్రదేశ్ కులు వెళ్తుండగా.. రామన్, మహిళ గొంతుకోసి హత్య చేసినట్లు, మృతదేహాన్ని అక్కడే అడవుల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కులు అడవుల్లో మృతదేహాన్ని కనుక్కున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో గత నెల శ్రద్ధా వాకర్ ఉదంతం తీవ్ర చర్చనీయాంశం అయింది. అఫ్తాబ్ పూనావాలతో లివి ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధా వాకర్ ని అఫ్తాబ్ దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీ సమీపంలో ఉన్న అడవుల్లో పడేశాడు. ఈ ఘటన తర్వాత కేరళలో ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న సింధు అనే యువతని కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు.