On Actor Tunisha Sharma’s Death, BJP MLA’s “Love Jihad” Theory: సీరియల్ నటి తునీషా శర్మ మరణంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆమె మరణంలో లవ్ జిహాద్ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో తునీషా శర్మ ఓ టీవీ షో సెట్ లో ఆత్మహత్యకు పాల్పడింది. ‘అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్’ అనే టీవీ షోలో తునీషా శర్మ సహ నటుడు షీజాన్ మహ్మద్ ఖాన్ వల్లే తను ఆత్మహత్యకు పాల్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా తునీషా తల్లి ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదు అయింది. పోలీసులు మహ్మద్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత 15 రోజుల క్రితం వీరిద్దరు విడిపోయారని, ఈ ఆత్మహత్యకు మహ్మద్ ఖానే కారణం అని ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
Read Also: MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జైల్లో నందకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ
ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే( బీజేపీ) రామ్ కదమ్ ఈ ఆత్మహత్యలో ‘లవ్ జిహాద్’కోణం ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసును క్షుణ్ణంగా విచారిస్తామని.. అన్ని కోణాల్లో పరిశీలిస్తామని.. దోషులను విడిచిపెట్టబోమని, తునీషా శర్మ కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఆత్మహత్యకు కారణాలు ఏమిటి..? ఇందులో లవ్ జిహాద్ ఉందా..? లేక మరేదైనా సమస్య ఉందా..? అనేది దర్యాప్తులో తేలుతుందని తునీషా కుటుంబానికి 100 శాతం న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
ముంబైలోని వసాయ్ కోర్టు షీజన్ మహ్మద్ ఖాన్‌ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. శనివారం 20 ఏళ్ల తునీషా శర్మ ఓ టీవీ షో సెట్లోని వాష్ రూములో ఉరివేసుకుంది. ఎంత సేపటికి బయటకు రావకపోవడంతో తలుపులు బద్ధలు కొట్టి చూస్తే మరణించి ఉంది. షూటింగ్ సిబ్బంది ఆమెను తెల్లవారుజామున 1.30 గంటలకు ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇది హత్యా..? ఆత్మహత్య..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.