ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విడుదలైన స్టిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా, ఎనర్జీతో కనిపిస్తూ తన టైమ్‌లెస్ ఛార్మ్‌ను మరోసారి రుజువు చేశారు. ఆయన విన్టేజ్ లుక్, గ్రేస్ ప్రేక్షకుల మనసులను దోచుకుంటూ హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : JanaNayagan : రికార్డుల వేట మొదలు పెట్టిన జననాయగన్.. 24 గంటల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్
ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు ‘మీసాల పిల్ల’ మరియు ‘ససిరేఖ’ చార్ట్బస్టర్లుగా నిలవడంతో పాటు భారీ వ్యూస్‌తో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టాయి. ఇక డిసెంబర్ చివరి వారంలో విడుదల కాబోతున్న మూడో పాటతో అంచనాలు మరింత పెరగనున్నాయి. హిట్ మెషిన్ దర్శకుడు అనిల్ రవిపూడి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎప్పటి నుంచో చూడాలని కోరుకుంటున్న క్లాసిక్, నాస్టాల్జిక్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవి పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ రోల్లో కనిపించనుండటం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. భారీ స్థాయిలో నిర్మితమవుతున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. వినోదం, భావోద్వేగాలు, మెగాస్టార్ మ్యాజిక్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వనుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.