Mani Shankar Aiyar: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతు గురించి తెలియజేయడానికి వెళ్లిన భారత దౌత్య బృందాలపై కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ని టార్గెట్ చేసుకున్నారు. భారత్ దౌత్య బృందాలు వెళ్లిన 33 దేశాల్లో ఏదీ కూడా పహల్గామ్ దాడికి పాకిస్తాన్‌ను నిందించలేదని అన్నారు.
Pakistan: పాకిస్తాన్లో అనుకోని ప్రమాదం జరిగింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా(కేపీకే) ప్రావిన్సులో ‘‘మోర్టార్ షెల్’’ పేలుడుతో ఐదుగురు పిల్లలు మరణించారు. మరో 13 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. లక్కీ మార్వాట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు బాలికలు ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tragedy: గుజరాత్‌లోని సూరత్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. భార్య వేరే వ్యక్తితో ‘‘వివాహేతర సంబంధం’’ ఉందనే కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత వ్యక్తిని అల్పేష్ భాయ్ కాంతిభాయ్ సోలంకి(41)గా గుర్తించారు. అల్పేష్ తన 7,2 ఏళ్ల ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు, ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో భార్య, ఆమె ప్రేమికుడిని అరెస్ట్ చేశారు. Read Also: Transgender In Court: […]
Rajnath Singh: ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ‘‘ఓట్ల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాల అణుబాంబు’’ తన వద్ద ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం తీవ్రంగా విమర్శించారు. ఆ అణుబాంబును పేల్చాలని సవాల్ విసిరారు.
Bangladesh: గతేడాది ఆగస్టు 05న షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, బంగ్లాదేశ్ నుంచి ఇండియా పారిపోయి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఆమె దేశాన్ని వదలాల్సి వచ్చింది. ఆ తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, షేక్ హసీనా దేశాన్ని వదిలిన ఆగస్టు 5న ‘‘విప్లవ వార్షికోత్సవం’’గా జరుపుకోబోతోంది. హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రోజే, […]
Rahul Gandhi: "వ్యవసాయ చట్టాలను" వ్యతిరేకించినందుకు దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ తనను బెదిరించాడని రాహుల్ గాంధీ అన్నారు. తనను బెదిరించడానికి బీజేపీ జైట్లీని తన వద్దకు పంపిందని శనివారం ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణల్ని బీజేపీ తిప్పికొట్టింది.ఆ సమయంలో అరుణ్ జైట్లీ బతికేలేరనే విషయాన్ని కాంగ్రెస్ నేత మరిచిపోయారని ఎద్దేవా చేసింది.
Prajwal Revanna: గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో సంచలనంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించింది. అత్యాచారం కేసులో కోర్టు అతడికి ‘‘జీవితఖైదు’’ విధించింది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆయన ఇంట్లో పనిచేసే మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనను బెంగళూర్ కోర్టు దోషిగా తేల్చింది.
Malegaon blast case: మాలేగావ్ బాంబు పేలుడు కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ను ఎన్ఐఏ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ATS) తనను తీవ్రంగా హింసించిందని బీజేపీ మాజీ ఎంపీ ఆరోపించింది. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆధారాలు లేవని చెప్పింది.
PM Modi: ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తీరును కొనియాడారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన భర్తను చంపేందుకు తన సోదరులతో కలిసి ప్లాన్ చేసింది. దాదాపుగా మరణం అంచులో ఉన్న సదరు వ్యక్తి ఓ అపరిచిత వ్యక్తి మూలంగా రక్షించబడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. డాక్టర్ సహాయకుడిగా పనిచేస్తున్న రాజీవ్ అనే వ్యక్తి కాళ్లు, చేతులు విరిగిపోయి, తీవ్రమైన బాధతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.