People Fall Sick After Eating Leftover Food At Funeral In Chhattisgarh: అంత్యక్రియల తర్వాత మిగిలిన ఆహారం తిన్న 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. 40 మంది అస్వస్థతలకు గురైనట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఫుడ్ పాయిజనింగ్ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. బాధితులంతా ఆదివారం ఉదయం రామానుజ్‌నగర్ డెవలప్‌మెంట్ బ్లాక్ పరిధిలోని విషున్‌పూర్ గ్రామంలో ఆహారం తీసుకున్నారని వైద్యాధికారి డాక్టర్ ఆర్ఎస్ సింగ్ తెలిపారు. బాధితులను సూరజ్ పూర్ ఆస్పత్రికి తరలించాగా.. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Cock Fights: కోడిపందాలపై ఆంక్షలు…పశ్చిమ గోదావరి ఎస్పీ వార్నింగ్
వ్యక్తి మరణించిన తర్వాత పదో రోజు కార్యక్రమానికి వండిన వంటలు మిగిలాయి. వీటిని శనివారం బాధితులు తిన్నారు. ఆహారం తీసుకున్న రెండు మూడు గంటల తర్వాత మహిళలు, పిల్లలతో సహా 40 మంది వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వీరందరికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు ఉన్నాయి. వీరందరికి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్ కు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది.