Taiwan Says China Deployed 71 Warplanes In Weekend War Drills: జిత్తులమారి చైనా, తైవాన్ పైకి కాలుదువ్వుతోంది. తైవాన్ ద్వీపాన్ని ఆక్రమించుకునే లక్ష్యంతో డ్రాగన్ కంట్రీ పావులు కదుపుతోంది. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. తాజాగా తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాల పేరుతో చైనా తన యుద్ధవిమానాలను మోహరించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. దాదాపుగా 71 యుద్ద విమనాలను మోహరించినట్లు వెల్లడించింది. డజన్ కు పైగా యుద్ధ విమానాలు తైవాన్ గగనతలాన్ని ఉల్లంఘించినట్లు తెలిపింది. ఈ యుద్ధ విమానాల్లో అత్యధునిక సుఖోయ్-30 విమానాలు ఉన్నట్లు తైవాన్ తెలిపింది. గత 24 గంటల్లో 43 చైనా యుద్ధ విమానాలు తైవాన్ జలసంధిని దాటాయని, ఇది తాజా తీవ్రతను సూచిస్తోందని తైవాన్ తెలిపింది.
Read Also: Indonesia: ఇండోనేషియాలో విపత్తు.. నేటితో ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..
‘వన్ చైనా’ విధానంలో తైవాన్ భాగం అని చైనా వాదిస్తోంది. అయితే తైవాన్ మాత్రం తామది స్వతంత్య్ర దేశం అని చెబుతోంది. అమెరికా, తైవాన్ కు మద్దతు ఇస్తోంది. గతంలో యూఎస్ స్పీకర్ నాన్సీపెలోసీ తైవాన్ లో పర్యటించారు. విడతల వారీగా పలువురు యూఎస్ఏ నాయకులు తైవాన్ ను సందర్శించారు. ఈ పరిణామాలతో తైవాన్-చైనాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో కూడా తైవాన్ ను స్వాధీనం చేసుకుంటామని నేతలు స్పష్టం చేశారు. ఇక తైవాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. చైనాతో ఢీ అంటే ఢీ అంటోంది. ఇటీవల తవాంగ్ ఘర్షణల సమయంలో చైనీస్ సైనికులను భారత సైనికులు తరిమి కొట్టడంపై తైవాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.