World Economy Is Headed For A Recession In 2023: ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందని ఇప్పటికే అనేక ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. తాజాగా సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ 2023లో ఆర్థిక మాంద్యం తప్పకుండా వస్తుందని అంచానా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్భన పరిస్థితులు, పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడాన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది ఆర్థికమాంద్యం వస్తుందని చెబుతోంది. గ్లోబల్ ఎకానమి 2022లో 100 ట్రిలియన్ డాలర్లను అధిగమించిందని.. అయితే ఇది వచ్చే ఏడాది తగ్గుతుందని బ్రిటిష్ కన్సల్టెన్సీ తన వార్షిక వరల్డ్ ఎకానామిక్ లీగ్ టేబుల్ లో పేర్కొంది.
అధిక ద్రవ్యోల్భాన్ని నివారించేందుకు వడ్డీరేట్ల పెరుగుదల ఫలితంగా వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం ఎదుర్కొనే అవకాశం ఉంని సీఈబీఆర్ డైరెక్టర్ కే డేనియల్ న్యూఫెల్డ్ అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) అంచనాతో పోలిస్తే ప్రస్తుతం ప్రకటించిన అంశాలు మరింత నిరాశజనకంగా ఉన్నాయి. ప్రపంచంలో మూడింట ఒక వంతు ఆర్థికవ్యవస్థలు ఇబ్బందులు ఎదర్కొంటాయని.. గ్లోబల్ జీడీపీ 2 శాతం కన్నా తక్కవ ఉండే అవకాశం ఉందని, దీనికి 25 శాతం అవకాశం ఉందని ఇది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తుందని సంస్థ వెల్లడించింది.
Read Also: Shraddha Walkar Case: శ్రద్ధావాకర్ కేసులో కీలక సాక్ష్యం.. అఫ్తాబ్‌కు వాయిస్ టెస్ట్
2037 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల జీడీపీ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలను చేరుకోవడం రెట్టింపు అవుతుందని అభిప్రాయపడింది. 2037 నాటికి తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతం 2037 నాటికి ప్రపంచ ఉత్పత్తిలో మూడో వంతు వాటాను కలిగి ఉంటుందని.. ఐరోపా 5వ వంతు కంటే తక్కువకు తగ్గిపోతుందని అంచానా వేసింది. మరోవైపు కోవిడ్ పరిణామాలతో చైనా అనుకున్న సమయానికి యూఎస్ఏ ఆర్థిక వ్యవస్థను కిందికి నెట్టేసే పరిస్థితి లేదని సంస్థ తెలిపింది.
ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా-తైవాన్ ఉద్రిక్తత వంటి అంశాలు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే భారతదేశం 2032 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 10 ట్రిలియన్ డాలర్లగా ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచానా వేసింది. రాబోయే 15 ఏళ్లలో యూకే ప్రపంచంలో 6వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఫ్రాన్స్ ఏడో స్థానం నిలుస్తుందని అంచానా వేస్తున్నారు.