4 Foreigners Test Covid Positive At Bihar’s Gaya Airport, Isolated: చైనాలో కోవిడ్ కొత్తవేరియంట్ బీఎఫ్-7 విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసిన తర్వాత అక్కడ కోవిడ్ దారుణంగా వ్యాపిస్తోంది. బీజింగ్, షాంఘై పాటు ఇతర నగరాల్లో కూడా కోవిడ్ కేసులుతో ఆస్పత్రులు నిండిపోయాయి. అక్కడ రానున్న రోజుల్లో మూడు కోవిడ్ వేవ్ లు వస్తాయని పరిశోధకులు అంచానా వేస్తున్నారు. గడిచిన 20 రోజుల్లోనే 25 కోట్ల కేసులు నమోదు అయ్యాయి. జనవరి నెలలో కోవిడ్ కేసులు తారాస్థాయికి చేరుతాయని అంచానా.
ఇదిలా ఉంటే తాజాగా ఇండియా కూడా కోవిడ్ రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎయిర్ పోర్టుల్లో కోవిడ్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆదివారం చైనా నుంచి వచ్చిన ఆగ్రాకు చెందన ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అతని నమూనాలను లక్నోలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబుకు తరలించి వ్యక్తిని ఐసోలేషన్ కు తరలించారు. ఇదిలా ఉంటే తాజాగా నలుగురు విదేశీయలకు కోవిడ్ పాజిటివ్ గా గుర్తించారు అధికారులు.
Read Also: World Recession: 2023లో ఆర్థిక మాంద్యం తప్పదు.. తాజా నివేదికలో వెల్లడి..
బీహార్ లోని గయా విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ టెస్టుల తరువాత నలుగురు విదేశీ పౌరులకు కరోనా సోకినట్లు తెలిసింది. వారిని హోటల్ లో ఐసోలేషన్ లో ఉంచారు. ఇంగ్లాండ్ నుంచి ఇద్దరు మయన్మార్ నుంచి ఒకరు, థాయ్ లాంట్ నుంచి ఒకరు బోధ్ గయాకు వచ్చారు. వీరందరికి కోవిడ్ వచ్చినా.. లక్షణాలు పెద్దగా లేదు.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 196 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 3,428కి పెరిగాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లు. వీరిలో 5,30,695 మరణాలు చోటు చేసుకున్నాయి.