In Shraddha Walkar Murder Case, Cops Find New Audio Proof: దేశాన్ని కుదిపేసిన శ్రద్ధావాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు అఫ్తాబ్ పూనావాాలా, శ్రద్ధాతో గొడవపడుతున్న ఆడియో క్లిప్ ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఈ ఆడియో క్లిప్ కీలకంగా పరిగణిస్తున్నారు పోలీసులు. దీన్ని పెద్ద సాక్ష్యంగా పరిణిస్తున్నారు. ఈ భయంకరమైన హత్యకు సంబంధించి అఫ్తాబ్ ఉద్దేశాన్ని నిర్థారించేందుకు ఈ ఆడియో క్లిప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
తాజాగా ఢిల్లీ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఫోరెన్సిక్ టీం అఫ్తాబ్ వాయిస్ శాంపిల్ ను ఈ రోజు సేకరించనున్నారు. ఈ కేసులో పురోగతిని సాధించేందుకు అఫ్తాబ్ వాయిస్ ను ఆడియో క్లిప్ తో పోల్చనున్నారు. దేశ రాజధానిలోని సీబీఐ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్)లో వాయిస్ శాంప్లింగ్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. శుక్రవారం శ్రద్ధా కేసులో ఢిల్లీ కోర్టు విచారణ జరిపింది. అఫ్తాబ్ జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడగించింది. నవంబర్ 26 నుంచి నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యాడు.
Read Also: Karnataka: ఉద్రిక్తత పెంచుతున్న మంగళూర్ హత్య.. 144 సెక్షన్ విధింపు..
ఇప్పటికే పోలీసులు విచారణలో అఫ్తాబ్, శ్రద్ధా వాకర్ ను చంపినట్లు వెల్లడించారు. నార్కో ఎనాలిసిస్, పాలిగ్రాఫ్ టెస్టుల్లో కూడా అఫ్తాబ్ శ్రద్ధాను చంపినట్లు తెలిపాడు. దీంతో పాటు ఢిల్లీ సమీపంలో సేకరించిన శ్రద్ధా ఎముకలు, తండ్రి డీఎన్ఏతో సరిపోవడంతో ఈ కేసు మరింత బలపడింది. తాజాగా ఈ వాయిస్ టెస్టు కూడా సరిపోతే కేసు మరింత స్ట్రాంగ్ అవుతుంది.
లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న అఫ్తాబ్, శ్రద్ధా వాకర్ తరుచు పెళ్లి విషయంలో గొడవపడేవారు. ఈ క్రమంలో అఫ్తాబ్, శ్రద్ధా వాకర్ ను గొంతు కోసి హతమార్చాడు. శరీరాన్ని 35 ముక్కలుగా చేసి మోహ్రౌలీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. దాదాపుగా 6 నెలల తర్వాత కూతురు గురించి శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై రాజకీయంగా కూడా ప్రభావాన్ని చూపింది. ఈ కేసులో లవ్ జీహాద్ కోణం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.