Rahul Gandhi criticizes Prime Minister Narendra Modi: భారత్ జోడో యాత్రలో మరోసారి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ, బీజేపీ పాలనపై శుక్రవారం విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో రెండు భారతదేశాల ఉన్నాయని.. ఒకటి రైతులు, కార్మికులు, నిరుద్యోగులతో కూడినది అయితే రెండోది 100 మంది ధనవంతులకు చెందినదని.. వీరి చేతుల్లోనే దేశ సంపద సగం ఉందని అన్నారు. హర్యానా పానిపట్ లో జరిగిన ర్యాలీలో అగ్నిపథ్ స్కీమ్, జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్న హర్యానా నిరుద్యోగంలో ‘‘ఛాంపియన్’’గా నిలిచిందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 38 శాతం ఉందని విమర్శించారు. కార్పోరేట్ ఇండియా ఆర్జించే లాభాల్లో 90 శాతం కేవలం 20 కంపెనీలదేనని కాంగ్రెస్ నేత అన్నారు. దేశ సంపదలో సగం 100 మంది చేతుల్లో ఉందని విమర్శించారు. ఒక భారతదేశంలో కోట్లాది మంది రైతులు, నిరుద్యోగుల ఉంటే రెండో భారతదేశంలో కేవలం 200-300 మంది ఉన్నారని బీజేపీని విమర్శించారు. పానిపట్ గతంలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని.. వేలాది చిన్న వ్యాపారాలు లక్షలాది మందికి ఉపాధి కల్పించాయని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Off The Record: అయ్యన్నపాత్రుడి ఆలోచన అదేనా?
నరేంద్రమోదీ నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీతో చిన్న తరహా పరిశ్రమలపై పడ్డారని..నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలు కాదని, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను నాశనం చేసే ఆయుధాలు అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో సాయుధ దళాల్లో చేరిన వారు సర్వీస్ టర్మ్, పెన్షన్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి లేదని.. అగ్నిపథ్ స్కీమ్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ ఔత్సాహికులు కలను కేంద్రం ధ్వంసం చేసిందని ఆరోపించారు. కేవలం 25 శాతం మంది మాత్రమే సైన్యంలో పనిచేస్తే మిగతా వారు నిరుద్యోగులు అవుతారని అన్నారు. ఇప్పటి వరకు 3 వేల మేర యాత్ర చేశానని హిందువులు, ముస్లింలు, సిక్కులు ప్రజలంతా చేయిచేయి కలిపి నడుస్తున్నారని.. బీజేపీ ద్వేషానికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ అన్నారు.
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో గాంధీ జాతీయ జెండాను ఎగురవేయడంతో ముగుస్తుంది. పాదయాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్‌లను కూడా కవర్ చేసింది.