Flight Crash: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలింది. 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం పోఖారాలోని అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై కుప్పకూలింది. ప్రమాదం సమయంలో ఫ్లైట్ లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ప్రకటించారు. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఎయిర్ పోర్టును మూసేశారు. ప్రమాదంలో చాలా…
Pakistan Crisis: పాకిస్తాన్ లో పరిస్థితులు దిగజారాయి. తినడానికి తిండిలేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. గోధుమ పిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. పిండికి పెరిగిన రెట్లు, వ్యాపారులు బ్లాక్ చేయడంతో అక్కడ గోధుమ పిండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్( పీఓకే)లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్సుల నుంచి గోధుమల లోడ్ తో ఏదైనా ట్రక్కు వెళ్తే, బలూచిస్తాన్, పీఓకేకు చేరే అవకాశమే […]
Miss Universe 2022: మిస్ యూనివర్స్ 2022 కిరీటం అమెరికాకు చెందిన ఆర్బోని గాబ్రియేల్ ను వరించింది. అమెరికాలోని లూసియానలోని న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఈ పోటీల్లో ఆర్బోని గాబ్రియేల్ మిస్ యూనివర్స్ కిరిటాన్ని సొంతం చేసుకుంది. 71వ మిస్ యూనివర్స్ పోటీల్లో మొత్తం 84 దేశాల నుంచి అందగత్తెలు పోటీలో పాల్గొన్నారు. మిస్ వెనుజులా ఫస్ట్ రన్నరప్ గా నిలువగా.. మిస్ డొమినికన్ రిపబ్లిక్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. మిస్ యూనివర్స్ 2021గా నిలిచిన భారత మహిళ హర్నాజ్ కౌర్…
India won't be coerced by anybody, Jaishankar's message to Pakistan, China: భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మే 2020లో చైనా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)పై యథాతథ స్థితిని ఏకపక్షంగా మర్చడానికి ప్రయత్నించిందని దీనికి భారత్ ధీటుగా, ధృడమైన సందేశాన్ని పంపిందని జైశంకర్ శనివారం అన్నారు. తుగ్లక్ పత్రిక 53వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వద్ద కూడా చైనా ఇలాంటి దురాక్రమణకే…
Ukraine War: ఉక్రెయిన్ పై మరోసారి రష్యా విరుచుకుపడింది. శనివారం క్షిపణులతో దాడి చేసింది. రష్యాతో జరుగుతన్న యుద్ధంతో ఉక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులను అందచేస్తామని బ్రిటన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేసింది. ఇదిలా ఉంటే రష్యా క్షిపణల శిథిలాలు తమ భూభాగంలో పడ్డాయని మల్డోవా దేశం ఆరోపించింది. తూర్పు ప్రాంతంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన డ్నిప్రోలో పై క్షిపణులతో దాడి చేసింది.
Kerala Teacher Arrested For Molesting 26 Students: విద్యా బుద్ధులు నేర్పాల్సిన వాడే బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. విద్యార్థినులపై లైంగిక దాడి చేస్తూ పశువాంఛ తీర్చుకుంటున్నాడు. మొత్తం 26 మంది విద్యార్థినుల 52 ఏళ్ల ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ లో జరిగింది. నవంబర్ 2021 నుంచి 26 మంది విద్యార్థులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
IND vs SL 3rd ODI: భారత్, శ్రీలంక మధ్య నేడు తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా చివరిదైన మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మూడు వన్డేల సిరీస్ లో రెండు వన్డేలు గెలిచి టీం ఇండియా ఫుల్ జోష్ లో ఉంది. మూడో వన్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు రెండు వన్డేల్లో దారుణ పరాజయం చవిచూసిన శ్రీలంక మూడో వన్డేలో గెలిచైనా పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
Husband chops off wife's lover's head after catching them together: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని దారుణంగా హత్య చేశాడు భర్త. తన భార్యతో కలిసి అభ్యంతరకర స్థితిలో ఉన్న ప్రియుడిని చూసిన భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో కోపంతో ప్రియుడిని అంతం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ లోని లోంజో గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోంజో గ్రామానికి చెందిన విశ్వనాథ్ సుండి అనే వ్యక్తి తన భార్య ప్రేమికుడితో కలిసి ఉండటాన్ని చూసి గొడ్డలిగో తలను…
60,000 deaths in a month due to covid in China: చైనాను కోవిడ్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడ జీరో కోవిడ్ విధానం ఎత్తేయడంతో ఎప్పుడూ చూడని విధంగా కేసులు నమోదు అవుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనాలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరబోతున్నట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే చైనా మాత్రం మరణాలు, కేసుల వివరాలను స్పష్టంగా ప్రకటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే చైనాలో ఒకే నెలలో కోవిడ్ బారినపడి ఏకంగా 60,000 మంది మరణించినట్లు చైనా…
Boycott on Muslim traders in Karnataka temple fair: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ మహాలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) మరో వర్గం వారికి వార్నింగ్ ఇస్తోంది. దీనికి సంబంధించి ఆలయ పరిసరాల్లో ఓ పోస్టర్ కూడా ఏర్పాటు చేసింది. హిందూ మతం, సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న హిందూ వ్యాపారులు మాత్రమే వాణిజ్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుందని బ్యానర్ లో పేర్కొన్నారు.