Miss Universe 2022: మిస్ యూనివర్స్ 2022 కిరీటం అమెరికాకు చెందిన ఆర్‌బోని గాబ్రియేల్ ను వరించింది. అమెరికాలోని లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఈ పోటీల్లో ఆర్‌బోని గాబ్రియేల్ మిస్ యూనివర్స్ కిరిటాన్ని సొంతం చేసుకుంది. 71వ మిస్ యూనివర్స్ పోటీల్లో మొత్తం 84 దేశాల నుంచి అందగత్తెలు పోటీలో పాల్గొన్నారు. మిస్ వెనుజులా ఫస్ట్ రన్నరప్ గా నిలువగా.. మిస్ డొమినికన్ రిపబ్లిక్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. మిస్ యూనివర్స్ 2021గా నిలిచిన భారత మహిళ హర్నాజ్ కౌర్ సంధు, ఆర్‌బోని గాబ్రియేల్ ను కిరీటంతో అలంకరించారు.
Read Also: S Jaishankar: చైనా, పాకిస్తాన్‌కు జైశంకర్ వార్నింగ్..
మిస్ యూఎస్ఏ 2022గా నిలిచిన ఆర్‌బోని గాబ్రియేల్ మిస్ యూనివర్స్ 2022గా కిరిటాన్ని కైవసం చేసుకుంది. ఫ్యాషన్ డిజైనర్, మోడల్ అయిన ఆర్‌బోని గాబ్రియేల్, తన చిన్న తనం నుంచే ఫ్యాబ్రిక్స్, టెక్స్ టైల్స్ డిజైన్స్ మక్కువ పెంచుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో, ఆమె 2018లో ఫైబర్స్‌లో మైనర్‌తో ఫ్యాషన్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆర్‌బోని గాబ్రియేల్ సొంతంగా ఆర్‌బోని నోలా అనే దుస్తుల కంపెనీకి సీఈఓగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇండియాకు చెందిన దివితా రాయ్ మిస్ యూనివర్స్ కిరీటంపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది.