IND vs SL 3rd ODI: భారత్, శ్రీలంక మధ్య నేడు తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా చివరిదైన మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మూడు వన్డేల సిరీస్ లో రెండు వన్డేలు గెలిచి టీం ఇండియా ఫుల్ జోష్ లో ఉంది. మూడో వన్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు రెండు వన్డేల్లో దారుణ పరాజయం చవిచూసిన శ్రీలంక మూడో వన్డేలో గెలిచైనా పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
Read Also: Jharkhand: శృంగారం చేస్తూ దొరికిపోయిన భార్య, ప్రియుడు.. తల నరికేసిన భర్త
గతంలో తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్ తో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగే వన్డే మ్యాచులో భారతజట్టులో కీలక మార్పలు ఉంటాయని తెలుస్తోంది. యువ ఆటగాళ్లకు తుదిజట్టులో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ లకు చోటు దక్కుతుందా..? లేదా.? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Rajashree Swain: మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు
ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇండియాకు కీలకమైన మ్యాచులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బూమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీనే భారత బౌలింగ్ కు నేతృత్వం వహించాల్సి ఉంటుంది. దీంతోనే అతడికి రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ ను తీసుకునే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టడంపై టీం మేనేజ్మెంట్ పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్వీ20ల్లో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్ కు చోటు లభించే అవకాశం ఉంది.