Nepal plane crash: నేపాల్ విమాన ప్రమాదం విషాదాన్ని నింపింది. నేపాల్ తో పాటు భారత్ కు చెందిన ప్రయాణికులు కూడా మరణించారు. సిబ్బంది, ప్రయాణికులతో మొత్తం 72 మంది మరణించారు. అయితే ఈ విమాన ప్రమాదం తర్వాత అనేక విషాద వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తామంతా సేఫ్ గా ల్యాండ్ అవుతామని అనుకున్నారు.. కానీ ల్యాండింగ్ కొన్ని నిమిషాల ముందు కుప్పకూలిపోయింది యతి ఎయిర్ లైన్స్ విమానం.
Man Dragged By Scooter On Bengaluru Road After Accident in bengaluru: న్యూఇయర్ రోజు ఢిల్లీలో ఓ యువతిని కారుతో 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కారుతో ఢీకొట్టి, యువతి కారుకింద చిక్కుకుందని తెలిసినా.. ఆపకుండా అత్యంత పాశవికంగా హత్య చేశారు నిందితులు. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు ఆ తరువాత కూడా జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ లో ఓ వృద్ధుడిని ఢీకొట్టిన తర్వాత తన స్కూటర్ తో ఈడ్చుకెళ్లాడు…
Rahul Gandhi's comments on RSS and Varun Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హోషియార్ పూర్ లో భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆఫీసుకు వెళ్లాలంటే ముందుగా నా తల నరకాలి అంటూ మంగళవారం వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ, తన బంధువు వరణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ పెరుగుతున్న ఊహాగానాల మధ్య రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని…
Tenure of JP Nadda as BJP national president extended till June 2024: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయాధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా(జేపీనడ్డా) పదవీ కాలాన్ని పొడగిస్తూ బీజేపీ జాతీయకార్యవర్గ సమాావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. జూన్,2024 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడగించారు. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు. జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొగడిస్తున్నట్లు కేంద్రహోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని అంతా ఏకగ్రీవంగా…
Layoffs in the Indian tech industry: భారతీయ టెక్ పరిశ్రమల్లో కూడా లేఆఫ్స్ ఉండబోతున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో తమ నష్టాలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రభావం భారత కంపెనీలపై కూడా పడుతోంది.
Vrindavan Temple Corridor: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బృందావన్ టెంపుల్ కారిడార్ పై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఈ టెంపుల్ కారిడార్ వల్ల తాము నిరాశ్రయులం అవుతామని.. తమ జీవనాధారం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు రక్తంతో లేఖలు రాస్తున్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
BJP Defeats AAP By 1 Vote In Chandigarh Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సంచలనం నమోదు అయింది. ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నువ్వా నేనా అన్న రీతిలో పోరాడాయి. అయితే మొత్తం మున్నిపల్ కార్పొరేషన్ లో 35 కౌర్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆప్, బీజేపీ పార్టీలకు చెరో 14 మంది కౌన్సిలర్లు ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు, శిరోమణి అకాలీదళ్ కు ఒక కార్పొరేటర్ ఉన్నారు.
Walking 6,000-9,000 steps a day lowers risk of heart disease: ప్రస్తుతం గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు వయసు పైబడిన వారికి వచ్చే వ్యాధిగా గుండె జబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు 20 ఏళ్ల యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. జీవనతీరు మారడం, పని ఒత్తడి, ఆహారపు అలవాల్లు, వ్యాయామం లేకపోవడం ఇలా అన్ని కలిసి గుండె వ్యాధులకు కారణం అవుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం కీలక విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా మధ్యవయస్కులు,…
India vs Sri Lanka 3rd ODI: తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ వేదికగా ఇండియా, శ్రీలంకల మధ్య చివిరిదైన మూడో వన్డే ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వన్డేలను గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా, చివరిదైన మూడో వన్డేలో కన్నేసింది. క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఈ వన్డేలో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని శ్రీలంక భావిస్తోంది.
India Ready For Any Situation On China Border, Says Army Chief: చైనా సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) ఆకస్మిక పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లోని సరిహద్దుల్లో శాంతిని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణాటకలో జరిగిన ఆర్మీడే కార్యక్రమంలో వెల్లడించారు. సైన్యం గతేడాది కాలంలో దేశభద్రతకు సంబంధించి అనేక సవాళ్లను ధృడంగా ఎదుర్కొందని.. యుద్ధ…