Hindu terrorism does not exist, says MHA in RTI: భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి సమాచారం కోరుతూ.. ఆర్టీఐ కార్యకర్త ప్రపుల్ సర్దా హోంమంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఇదే విధంగా భారతదేశంలో కాషాయ ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం గురించి సమాచారాన్ని కోరారు. కాగా, భారతదేశంలో హిందూ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం లేవని స్పష్టం చేసింది హోం శాఖ. దీనిపై స్పందించిన ప్రఫుల్ సర్దా.. బుజ్జగింపు రాజకీయాల కోసం ఈ పదాన్ని సృష్టించారని అన్నారు. ఇదే విధంగా…
Man severely injured due to Chinese Manja: చైనా మాంజాదారం ప్రజల పాలిట ఉరితాడులా మారుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు గాలిపటాలను ఎగరేస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత చైనా మాంజా దారాన్ని వాడుతున్నారు. గాలిపటాలు నేలపై పడిపోయినప్పుడు ఆ దారం ద్విచక్రవాహనదారులు, పాదచారులకు ప్రమాదంగా మారుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వేగంగా బైకుపై వెళ్తున్న సమయంలో గొంతకు, మొహానికి చిక్కుకుని ప్రాణాలకు ప్రమాదంలోకి నెట్టుతున్నాయి.
physical assault on old woman: దేశంలో రోజుకు ఏదో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీ వరసలు మరిచి చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన జరిగింది. సొంతూర్లో దిగబెడతానని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు.
Shamshabad Metro works: ఎయిర్పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని, అవి శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. జనరల్ కన్సల్టెంట్ (జిసి) కోసం బిడ్ల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, ఈ నిపుణులైన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వచ్చే నెల మొదటి వారంలో నియమితులవనున్నారు.
Harish Rao: ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. సభకోసం మంత్రలు ఖమ్మం జిల్లాలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంత్రి హరీష్ రావు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్రవీరయ్య, రెడ్యానాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Union Minister Kishan Reddy criticizes CM KCR and KTR: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తండ్రిని, కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కేటీఆర్ లా మంత్రి కాలేదని, కష్టపడి పైకొచ్చామని అన్నారు. కేసీఆర్ కన్నా దిగజారి కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు మిడిమిడి జ్ఞానం, తప్పుడు ఆలోచనతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎవరూ బయటకు రాని సమయంలో నేను గాంధీ దవాఖానాతో పాటు ప్రభుత్వం…
Vande Bharat Express starts tomorrow: రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి దేశవ్యాప్తంగా 5 ట్రైన్లను ప్రారంభించారని.. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రేపు ప్రారంభం అయ్యే రైలు ఆరోదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 100 వందేభారత్ ట్రైన్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వందేభారత్ ట్రైన్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ తో సహా…
Tata Harrier Electric SUV Debuts At 2023 Auto Expo: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో రారాజుగా ఉంది దేశీయ ఆటోమేకర్ దిగ్గజం టాటా. వరసగా ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేస్తూ ప్రత్యర్థి కంపెనీలను వెనక్కి నెట్టేస్తోంది. దీనికి తోడు టాటా ఈవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాల్లో టాప్ గా నిలిచింది. టాటా నుంచి టిగోర్ ఈవీ ఉంది. ఇటీవల టియాగో ఈవీని కూడా లాంచ్ చేసింది. టాటా కాంపాక్ట్ ఎస్ యూ…
DMK Worker's Threat To Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం అలాగే కొనసాగుతోంది. డీఎంకే నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ‘గెట్ అవుట్ రవి’ అంటూ చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో పోస్టర్లను ఏర్పాటు చేశారు డీఎంకే పార్టీ నేతలు. ఇదిలా ఉంటే తాజాగా మరో డీఎంకే నేత బహిరంగంగానే గవర్నర్ రవిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని అధికార డీఎంకే పార్టీ వెల్లడించింది.…
Minister Harish Rao criticizes BJP: బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే అని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో స్థానం లేదని అన్నారు. ఈనెల 18న ఖమ్మంలో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం ఇల్లందులో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. బీజేపీలో చేరితే వారు రాజకీయాలకు దూరం అయిపోయినట్లే అని, వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి…