Ukraine Chopper Crash: ఉక్రెయిన్ లో ఘోరం జరిగింది. రాజధాని కీవ్ కు సమీపంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ హోంమంత్రి, డిప్యూటీ హోంమంత్రితో సహా మొత్తం 16 మంది మరణించారు. ఉక్రెయిన్ అధికారులు బుధవారం ఈ ప్రమాదం గురించి తెలిపారు. చనిపోయిన వారిలో హోం మంత్రి డెనిస్ డెనిస్ మొనాస్టైర్స్కీ మరియు అతని మొదటి డిప్యూటీ మినిస్టర్ యెవ్జెనీ యెనిన్తో సహా అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరణించిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.…
Kanti velugu second phase: ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్ల జోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు.
North Korea’s Kim Jong Un battling mid-life crisis, cries and drinks all day: ఉత్తర కొరియా నియంత, అధ్యక్షుడ కిమ్ జోంగ్ ఉన్ మధ్య వయస్సు సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రోజంతా విపరీతంగా తాడుతూ ఎడుస్తున్నట్లు ఉంటున్నాడని తెలిసింది. కిమ్ అనారోగ్య జీవనశైలిని గడుపుతున్నాడని ఎక్కువ సమయం స్పిరిట్, వైన్ తాగుతూ ఉన్నాడని అస్వస్థతకు గురైనట్టు ఓ నివేదిక పేర్కొంది. ఆదే సమయంలో 40 మందితో సరసాలాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ కు 39 ఏళ్లు నిండాయి.…
Gujarat university issue: క్యాంపస్ లో అమ్మాయి నమాజ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం గుజరాత్ లో చర్చనీయాంశంగా మారింది. వడోదరలోని ఎంఎస్ యూనివర్శిటీ వర్సిటీ ప్రాంగణంలో ఒక అమ్మాయి నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం కఠిన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని పలు మతసంస్థలు డిమాండ్ చేశాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన ఉద్రిక్తతలకు కారణం అయింది.
Hindu Temple Vandalised In Australia: ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు హిందూ ఆలయాలే టార్గెట్ గా ఆస్ట్రేలియాలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలో రెండు రెండు ఆలయాలపై దాడులకు తెగబడ్డారు. ఈ రెండు సంఘటనలు కూడా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. విక్టోరియాలోని క్యారమ్స్ డౌన్స్ లోని చారిత్రాత్మక శ్రీ విష్ణు దేవాలయంపై సోమవారం దాడి జరిగినట్లు అక్కడి మీడియా మంగళవారం నివేదించింది. అంతకుముందు మెల్బోర్న్ లోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ మందిర్ గేటుపై గ్రాఫిటీతో భారత వ్యతిరేక, ఖలిస్తానీ అనుకూల నినాదాలను రాశారు…
Congress claims Tejasvi Surya opened emergency exit on IndiGo flight: బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు, బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య చిక్కుల్లో ఇరుకున్నారు. గత నెలలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం, డిసెంబరు 10న, చెన్నై నుండి తిరుచిరాపల్లికి వెళ్లే ఇండిగో 6ఈ ఫ్లైట్ 6ఈ-7339 నేలపై ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచినట్లు […]
Indians See US As Biggest Military Threat After China, says Survey: భారత దేశానికి సైనిక పరంగా ముప్పు చైనా నుంచి పొంచి ఉందనేది అందరికి తెలిసిన విషయమే. చైనా నుంచే అతిపెద్ద సైనిక ముప్పు పొంచి ఉందని భారతీయులు విశ్వసిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే ఆ తరువాతి స్థానంలో అంతా పాకిస్తాన్ ఉంటుందని అనుకుంటారు.. కానీ, రెండో స్థానంలో అమెరికా నుంచి సైనిక ముప్పు ఉందని భారతీయులు ఓ సర్వేలో తెలిపారు. అమెరికాకు చెందిన గ్లోబల్ బిజినెస్ ఇంటెలిజెన్స్…
400 Days To Polls, Reach Out To All Voters, Says PM Modi At BJP Meet: ఢిల్లీలోొ జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ సమాయత్తం అవుతోంది. 2024, జూన్ వరకు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడగించింది. దీంతో పాటు ఈ ఏడాది 9 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.
Union Minister Ashwini Chaubey broke down in tears: కేంద్రమంత్రి, బీజేపీ నేత అశ్వినీ చౌబే మీడియా ముందు భోరున విలపించారు. సోమవారం చనిపోయిన బీజేపీ నేత పరుశురామ్ చతుర్వేదిని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఆయన మరణంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ నాయకుడు, కిసాన్ మోర్చా నాయకుడు పరుశురామ్ చతుర్వేదికి పాట్నాలో సంతాపాన్ని తెలుపుతూ విలేకరుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీ చౌబే ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. పక్కన ఉన్నవాళ్లు ఓదార్చే ప్రయత్నం చేసినా.. కన్నీళ్లు దిగమింగుకోలేకపోయారు.
Railway Budget 2023-24: కేంద్రప్రభుత్వం భారత రైల్వేలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లానే ఉద్దేశంతో ఆధునీకీకరిస్తోంది. ఇందులో భాగంగానే పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే 8 మార్గాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగుతు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది బడ్జెట్ లో మరిన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 2023-24 అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు బడ్జెట్ లో కేటాయింపుల పెరుగుద ఉండే అవకాశం ఉంది.